విదేశాల్లో ఉద్యోగం పేరిట నిరుద్యోగులకు కుచ్చు టోపి

7SEC12
– రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ నిర్వాకం!
– రూ.1.50 కోట్లపైనే లూటీ
– శిక్షణ పేరిట విదేశాల్లో నానా తిప్పలు
– పాస్‌పోర్టులను లాక్కున్న ప్రబుద్ధుడు
– బిక్కుబిక్కుమంటున్న బాధితులు
– ప్రధాన నిందితుడు అరెస్ట్
విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఆకట్టుకునే ప్రకటనలు! నిరుద్యోగుల నుంచి కోట్లు దండుకున్నాక.. ఎగనామం! ఇదీ ఓ సంస్థ నిర్వాకం! ఇప్పటికే ఉద్యోగం పేరిట కొందరు విదేశాల్లో మగ్గుతున్నారు! అక్కడ ఉద్యోగం లేక.. కనీసం తిరిగి వచ్చేందుకు పాస్‌పోర్టు లేక నానా యాతనలు పడుతున్నారు! ఇంకొందరు డబ్బు కట్టి లబోదిబోమంటున్నారు! సికింవూదాబాద్‌లోని బోయిన్‌పల్లిలో 1997లో వై ప్రభాకర్‌డ్డి అనే వ్యక్తి రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. ఈ అకాడమీ ద్వారా ఎయిర్‌క్షికాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజినీరింగ్‌లో రెండేళ్ల కాలపరిమిత గల డిప్లొమా కోర్సులో శిక్షణను ఇస్తున్నారు. డిప్లామా కోర్సులో శిక్షణతోపాటు, ఉద్యోగ అవకాశం కల్పిస్తామంటూ ఆ సంస్థ నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2.25 లక్షలు వసూలు చేసింది. శిక్షణ కూడా ఇచ్చింది. కాగా 2008లో ఇదే సంస్థలో 9 మంది డిప్లొమాలో చేరి శిక్షణ పూర్తిచేశారు.

శిక్షణ ముగిసిన 6 నెలల తర్వాత కూడా ఆ తొమ్మిది మందికి ఉద్యోగ అవకాశం కల్పించకపోవడంతో అభ్యర్థులు నిలదీశారు. దీంతో సంస్థ ప్రతినిధులు ముంబైలో ‘ఆన్‌లైన్ జాబ్ శిక్షణ’ పూర్తిచేయాల్సి ఉంటుందంటూ.. ఒక్కో అభ్యర్థి మరో రూ. 30వేలు చెల్లించాలని స్పష్టంచేసింది. దీంతో అభ్యర్థులంతా ఆ మొత్తం కూడా చెల్లించి.. ముంబైలో శిక్షణ పూర్తి చేశారు. ఈ శిక్షణ పూర్తయి 8 నెలలు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో తిరిగి అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో సంస్థ నోడల్ అధికారి సుబేద్‌దాస్ ఫిలిప్పీన్ దేశంలోని అంతర్జాతీయ విమానక్షిశయంలో శిక్షణ పొందినట్టయితే, మలేషియాలో మూడేళ్లపాటు నెలకు రూ. 36 వేల చొప్పున (మలేసియా కరెన్సీలో 2200 రింగ్‌రిట్) జీతం వస్తుందని నమ్మబలికాడు. ఈ శిక్షణ కోసం ఒక్కో అభ్యర్థి రూ.3.50 లక్షలు చెల్లించాలని అతడు తెలిపాడు. మూడున్నర లక్షలు చెల్లించిన అభ్యర్థికి అక్కడికి వెళ్లేందుకు విసా, 4 నెలల శిక్షణ, వసతి కల్పించనున్నట్లు దాస్ పేర్కొన్నాడు. దీంతో రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ 2008 బ్యాచ్‌కు చెందిన తొమ్మిది మందితోపాటు ఇతర సంస్థలో డిప్లొమా పూర్తిచేసిన 32 మంది ముందుకు వచ్చారు.

మొత్తం 41 మంది నుంచి ఒక్కో అభ్యర్థి నుంచి మూడున్నర లక్షల చొప్పున కోటీ 43 లక్షల యాభైవేల రూపాయలను వసూలు చేశారు. డబ్బులు చెల్లించిన 7 నెలల తర్వాత ఢిల్లీకి చెందిన వెంచర్ ఓవర్‌సీస్ కంపెనీ సీఈఓ ధర్మేష్‌జోషి ద్వారా 41 మందిలో కొందరు మలేషియాకు, మరికొంత మంది ఫిలిప్పీన్ దేశాలకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన అభ్యర్థులకు ధర్మేష్‌జోషి ఎయిర్‌క్షికాప్ట్ మొయింటెనెన్స్ ఇంజినీరింగ్‌లో కాకుండా, డెంటింగ్‌లో రెండు నెలలపాటు శిక్షణ ఇప్పించారు. శిక్షణ కాలంలో అభ్యర్థులను నానా ఇబ్బందులు పెట్టారు. ఎవరైనా అభ్యర్థి ఇదేమిటీ..? తాము మెయింటెనెన్స్ ఇంజినీరింగ్‌లో శిక్షణ పూర్తి చేస్తే.. డెంటింగ్‌లో ఎందుకు శిక్షణ ఇస్తున్నారని ప్రశ్నిస్తే వారి పాసుపోర్టులను లాక్కుని, మీరెలా ఇండియాకు వెళ్తారో చూస్తానంటూ.. నానా దూర్భలాడుతూ హింసలకు గురిచేశాడని బాధితులు అంటున్నారు. డెంటింగ్‌లో శిక్షణ అనంతరం మలేషియాలో ఉద్యోగాలు లేవని, అప్ఘనిస్తాన్‌లో ఉన్నాయని ధర్మేష్‌జోషి తెల్చిచెప్పాడు. దీంతో 41మందిలో తొమ్మిది మంది అప్ఘనిస్తాన్‌కు వెళ్లేందుకు సిద్ధమవ్వగా, మిగతా 32 మంది విరమించుకున్నారు.

2012 మే 25న ధర్మేష్‌జోషి 9 మందికి ఫోన్‌చేసి ఢిల్లీలోని తన కార్యాలయంలో పాస్‌పోర్టులను అందజేయాలని కోరాడు. దీంతో తొమ్మిది మంది పాసుపోర్టులను ఢిల్లీలోని ధర్మేష్ కార్యాలయంలో వాటిని అందజేశారు. అప్పటి నుంచి అప్పుడు.. ఇప్పుడు అంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితులంతా 2012, డిసెంబర్ 2న బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన బోయిన్‌పల్లి పోలీసులు ధర్మేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించి డిసెంబర్ 5న రిమాండ్‌చేశారు. అయితే సోమవారం బాధితులు తాము రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీలోనే డబ్బులు చెల్లించినందున సంస్థవారే తిరిగి డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.