విజయమ్మకు ముచ్చెమటలు

 వైఎస్ విజయమ్మకు నల్లగొండ జిల్లాలో తెలంగాణవాదులు చుక్కలు చూపించారు. సమైక్యవాదం పేరిట ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న నేతలకు తెలంగాణ ప్రాంతంలో పర్యటించే అర్హత లేదని తేల్చిచెప్పారు. ఇటీవలి వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు గురువారం ఆమె ఖమ్మం, నల్లగొండ జిల్లాలో పర్యటించేందుకు వచ్చా రు. vijayamma
ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆమెను నల్లగొండ జిల్లా సరిహద్దులోకి అడుగు పెట్టకుండా తెలంగాణవాదులు, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, శాంతిభవూదతల సమస్య తలెత్తడంతో పోలీసులు నల్లగొండ సరిహద్దులో ఖమ్మం జిల్లా పైనంపల్లిలోనే విజయమ్మను వెనక్కి
పంపించారు.

సరిహద్దు దాటకుండానే వెనక్కి..
షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.30గంటలకు కోదాడ నియోజకవర్గంలో పర్యటన ప్రారంభం కావాల్సి ఉండగా.. ఖమ్మం జిల్లా పైనంపల్లికి మూడు గంటల ప్రాంతంలో విజయమ్మ చేరుకున్నారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఆమెను అక్కడి నుంచి వెనక్కి వెళ్లాలని.. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా నల్లగొండలో పర్యటన రద్దు చేసుకోవాలని కోరారు. దీంతో ఆమె అక్కడే కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో జై తెలంగాణ అంటూ స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బురదతో కూడిన వాటర్ బాటిల్‌ను ఆమె వాహనంపై విసిరారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వైఎస్సార్సీపీ నేతలు ముందుకు కష్టమనే భావనకు వచ్చారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఆమె వాహనంలో ఎక్కించి వెనక్కిపంపారు.

దీంతో జగన్, విజయమ్మ అనుకూల, ప్రతికూల నినాదాలు, తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. విజయమ్మ వాహనంలోకి ఎక్కగానే ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి కందుల మధు ఆమె వా హనం ముందుభాగంపైకి ఎగిరి దూకారు. ఆమె ముఖానికి ఎదురుగా ఉన్న అద్దంపై చెప్పుతో కొడుతూ జై తెలంగాణ అని నినదించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆయనపై దాడికి దిగగా పోలీసులు అడ్డుకుని మధును తరలించారు. విజయమ్మను అరెస్టు చేసి ఆమె వాహనంలోనే నేలకొండపల్లి, కుసుమంచి, మోతె, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ పంపించారు. సూర్యాపేటలోనూ వైఎస్ విజయమ్మ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. వాహనంపై కోడిగుడ్లు విసిరేశారు.

రెండు నియోజకవర్గాల్లోనూ ఉద్రిక్తత: విజయమ్మ పర్యటన సందర్భంగా హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో బుధవారం రాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె పర్యటనకు నిరసనగా జేఏసీ, టీఆర్‌ఎస్ నాయకులు నల్లజెండాలతో నిరసనకు సిద్ధమయ్యారు. సమైక్య నాయకులు తెలంగాణకు రావద్దంటూ ప్లెక్సీలు, ప్లకార్డులు ప్రదర్శించాలని నిర్ణయించారు. తెలంగాణను ఆపేందుకు కుట్రలు చేస్తున్న నేతల ఓదార్పు అవసరం లేదని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి నలమాద ఉత్తంకుమాడ్డి, పంచాయతీరాజ్ మంత్రి కుందూరు జానాడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌డ్డి పేర్కొన్నారు. విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో రెండు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మోహరించారు. కోదాడలో 144సెక్షన్ పెట్టగా, హుజూర్‌నగర్, మేళ్లచెరువు మండలాల్లో బంద్‌కు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. హుజూర్‌నగర్ నుంచి కోదాడ వైపు వస్తున్న వైఎస్సార్సీపీ నేత గట్టు శ్రీకాంత్‌డ్డిని అరెస్టు చేసి.. చిలుకూరు పోలీసుస్టేషన్‌లో పెట్టారు.

వైఎస్ విగ్రహాలు ధ్వంసం
కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వైఎస్ విగ్రహాలను ధ్వంసం, దహనం చేశారు.గుడిబండలో విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేయగా.. కోదాడలోకాంస్య విగ్రహానికి పెట్రోలు పోసి తగులబెట్టారు. బూరుగడ్డ, గరిడేపల్లి మండలం ఎల్బీనగర్, నేరేడుచర్ల పట్టణం, మేళ్లచెరువు, మేళ్లచెరువు మండలం దొండపాడులో వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేశారు. విజయమ్మకు ఖమ్మం జిల్లాలోనూ తెలంగాణవాదుల నుంచి నిరసన సెగ తగిలింది.

జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచితెలంగాణవాదులు నిరసన తెలిపారు.కృష్ణా జిల్లా నుంచి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, వైరా నియోజకవర్గ పరిధిలోని కొణిజెర్ల, ఖమ్మం పరిధిలో రఘునాధపాలెం, పాలేరు పరిధిలోని కూసుమంచిలో రైతులను పరామర్శించా రు. పైనంపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించిన తెలంగాణవాదులు సీమాంధ్ర నాయకులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆమెను జిల్లాలో అడుగుపెట్టనివ్వబోమని భీష్మించారు. కుక్కల రవి అనే యువకుడు ‘సీమాంధ్ర నాయకులరా గో బ్యాక్’ నినాదాలు చేస్తూ విజయమ్మను అరెస్టు చేయాలని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొందరు గుడ్లతో దాడిచేశారు.

తెలంగాణ పౌరుడిగా వ్యతిరేకించా
విజయమ్మ పర్యటనను తెలంగాణ పౌరుడిగానే వ్యతిరేకించానని, రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తంకుమార్‌డ్డి స్పష్టం చేశారు. తెలంగాణవాదులు, కాంగ్రె స్ నాయకులు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసన తెలిపారని చెప్పారు. విజయమ్మ పర్యటన తెలంగాణ ప్రజలను అవమాన పరచడమేనని, సమైక్యాంధ్ర పార్టీకి తెలంగాణ రైతాంగం, ప్రజల గురించి ఏం అవసరమని ప్రశ్నించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.