విజయమ్మకు తెలంగాణ సెగ

goback
– అడుగడుగునా అడ్డుకున్న తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ నేతలు
– రోడ్డుపై వాహనాన్ని అడ్డుపెట్టిన ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య
– బలవంతంగా లాక్కెళ్లి అరెస్టు చేసిన పోలీసులు
వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ పర్యటనలో అడుగడుగునా విజయమ్మకు తెలంగాణ సెగ తగిలింది. బీఆర్‌అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత-చే ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలనే డిమాండ్‌తో హైదరాబాద్ నుంచి ఏపీ ఎక్స్‌వూపెస్‌లో సిర్పూ ర్ కాగజ్‌నగర్‌కు విజయమ్మ చేరుకున్నారు.

కాగజ్‌నగర్ నుంచి కౌటాల మండలం తుమ్మిడిహేటి శివారులో ప్రాణహిత ఒడ్డున ‘ప్రాణహిత- చేవెళ్ల’ ప్రాజెక్టు శిలాఫలకం సందర్శనకు భారీ కాన్వాయ్‌తో వెళ్తుండగా టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్నారు. రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరగా సమీపంలో సిర్పూర్ పేపర్ మిల్లు వద్ద తెలంగా ణ వర్కర్స్ యూనియన్ నేతలు అడ్డుతగిలారు. పోలీసులు వారిని బలవంతంగా పక్కకు తప్పించారు. సిర్పూర్(టి) సమీపంలో ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తన వాహనాన్ని నడి రోడ్డుపై నిలిపివేసి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యేను పోలీసు లు బలవంతంగా లాక్కెళ్లి జీపులో ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. తోపులాటలో పోలీసుల చేతిగోర్లు గీరుకుపోయి ఎమ్మెల్యేకు స్వల్పగాయాలయ్యాయి. విజయమ్మ పర్యటన సందర్భంగా అనేక చోట్ల టీఆర్‌ఎస్ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.