వాస్తవికవాది ప్రధాని కావాలి: రాజ్‌నాథ్

దేశం ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తుండడం, సామాన్యులపై ధరల దరువు మోత మోగుతుండడంతో ప్రధాని మన్మోహన్‌సింగ్ లక్ష్యంగా బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఎన్డీయేతో పోలిస్తే యూపీఏలోనే పాలన బాగుందని ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. దేశానికి ప్రధాని కావాల్సింది ఆర్థిక వేత్త కాదని, వాస్తవికవాది కావాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అభివూపాయపడ్డారు. ప్రస్తుతం దేశానికి విశ్వసనీయత కలిగిన, అవినీతి రహిత పాలనను అందించే ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉందని అన్నారు. ఇది కేవలం భవిష్యత్తుపై అవగాహన, దూరదృష్టి కలిగిన ప్రభుత్వాలతోనే సాధ్యమవుతుందని, అప్పుడే ప్రపంచంలో భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. కాగా, ఎన్డీయేపాలనపై ప్రధాని మన్మోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు ‘మేధోపూరిత అసత్యాల’కు పాల్పడుతున్నారని ఆ పార్టీ మరో సీనియర్ నేత యశ్వంత్‌సిన్హా పేర్కొన్నారు

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.