వాల్‌మార్ట్ లాబీయింగ్: రాజ్యసభలో రభస

న్యూఢిల్లీ: భారత్‌లో ఎఫ్‌డీఐల అనుమతి కోసం వాల్‌మార్ట్ చేసిన లాబీయింగ్‌పై రాజ్యసభలో పెద్ద రభసే జరిగింది. లాబీయింగ్‌పై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే సభకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో సభలో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు శాంతించక పోవడంతో ఛైర్మన్ సభను పది నిమిషాలపాటు వాయిదా వేశారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.