వాణి నమోనమామి!

మే 30న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం సమీప గోదావరిలో ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు సోమవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు సుమారు 50వేల మంది దాకా భక్తులు తరలివచ్చి, అంతర్వాహినిగా ఉన్న సరస్వతి నదిలో పుణ్యస్నానాలాచరించారు. -టీ మీడియా, మహదేవపూర్
మహదేవపూర్, టీ మీడియా : శ్రీకాళేశ్వర-ముక్త్తీశ్వరస్వామి దేవస్థాన త్రివేణి సంగమంలో పన్నెండు రోజులు కొనసాగిన సరస్వతి పుష్కరాలు సోమవారంతో ముగిశాయి. పు ష్కర ముగింపు కార్యక్షికమానికి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదపండితులు, ఆలయ అర్చకులు, దేవాదాయశాఖ అధికారులు, పాలక మండలి సభ్యులతో పాటు ఎమ్మెల్సీ మంగళవాయిద్యాలు, కోలాటాలతో ప్రధాన ఆలయం నుంచి త్రివేణి సంగమానికి చేరుకున్నారు. శాస్త్రోక్తంగా సరస్వతీనదికి పూజలు చేశారు. సరస్వతిదేవికి పసుపు కుంకుమ, పూలుపండ్లు, పట్టువస్త్రాలు, పంచామృతాలు సమర్పించి ముగింపు పూజలను వైభవంగా నిర్వహించారు. అనంతరం త్రివేణి సంగమంలోని జలాలను కలశాల్లో తీసుకువచ్చి ముక్తీశ్వరస్వామికి అభిషేకం నిర్వహించారు. అంతకు ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం ఎంఎల్‌సీ సంతోష్‌కుమార్‌కు వేదపండితులు, ఆలయ కమిటీ పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముగింపు పూజతో సరస్వతీనది ఆదిపుష్కరాలు ముగిసినట్లుగా వేదపండితులు ప్రకటించారు.కార్యక్షికమంలో ఆలయకమిటీ చైర్మన్ గుడాల కృష్ణమూర్తి, ధర్మకర్తలు అశోక్, సీతారాం, రాంనారాయణగౌడ్, శ్రీనివాస్, ఎండోమెంట్ సహాయ కమిషనర్ రాజేశ్వర్, ఈఓ హరివూపకాశ్‌రావు, సూపరింటెండెంట్ శ్రీనివాస్‌గౌడ్, వేదపండితులు కృష్ణమూర్తి, ప్రశాంతశర్మ, రామన్నశర్మ, లక్ష్మీనారాయణ, నాగేశ్‌శర్మ పాల్గొన్నారు.

పోటెత్తిన భక్తజనం
పుష్కరాల్లో చివరి రోజు త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, మెదక్, నల్గొండ, వరంగల్, రంగాడ్డి, హైదరాబాద్ , కరీంనగర్, ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లోని గడ్చిరోలి, చంద్రాపూర్, దంతెవాడ, బీజాపూర్ నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు చేసి ముక్తీశ్వరస్వామికి అభిషేకం, శ్రీశుభానందదేవి ఆలయంలో కుంకుమార్చనలు, సరస్వతీదేవిఆలయంలో అక్షరస్వీకార పూజలు చేశారు. సోమవారం 50వేల మంది పుష్కర స్నానాలు చేశారని, ప్రత్యేక దర్శనం, లడ్డు పులిహోర విక్రయం, అభిషేకం టికెట్ల విక్రయం ద్వారా ఆలయానికి రూ.3.60లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ చైర్మన్ కృష్ణమూర్తి తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.