వాజ్‌పేయి మార్గంలో కశ్మీర్ కు పరిష్కారం

వాజపేయి మార్గంలో కశ్మీర్ సమస్య పరిష్కరిస్తామని బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ నరేంద్ర మోడీ చెప్పారు. పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం తొలిసారి పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఏర్పాటైన ‘సంకల్ప్ ర్యాలీ’లో ఆయన ప్రసంగించారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ 60వ వర్దంతి సందర్భంగా ఈ సభను నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కశ్మీర్‌పై అనుసరిస్తున్న విధానాలను మోడీ దుయ్యబట్టారు. తుపాకులు రక్తపాతాన్ని మాత్రమే సృష్టిస్తాయి తప్ప ఎవరికీ మంచి చేయలేవన్నారు. కశ్మీర్ గాయాలను మాన్పాల్సిన అవసరముందని, అక్కడి యువతను జాతీయ స్రవంతిలోకి తెచ్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని అన్నారు.

వాజపేయి అధికారంలో ఉన్నప్పుడు కశ్మీర్ సమస్య పరిష్కారానికి తీవ్ర కృషి జరిపారని చెప్పారు. ఈ సమస్యను ఆయన దయ, ప్రేమ, చర్చల ద్వారా పరిష్కరించాలని ఆశించారని, ఎన్డీయే 2004లో తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే ఆ కల సాకారమై ఉండేదన్నారు.తాము అధికారంలోకి వస్తే వాజపేయి వారసత్వాన్ని కొనసాగిస్తామని, ఆయన అసంపూర్తిగా వదిలిన ఆ కార్యక్షికమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. తనపై విభజనవాది అంటూ వచ్చిన విమర్శలు కొట్టివేస్తూ తాను పార్టీలను.. హృదయాలను కూడా ఏకం చేసేందుకు కృషి జరుపుతున్నానని చెప్పుకున్నారు. ప్రధాని మన్మోహన్‌పై దాడిని కొనసాగిస్తూ సరబ్‌ను క్రూరంగా దాడి చేసి చంపేశాక మీరు చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ బీభత్సంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు భుజం భజం కలిపి వారిని ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్, బీజేపీ నేత శాంతకుమార్ ఈ సభలో పాల్గొన్నారు

కేంద్రంలో అసలు బాసెవరో: మోడీ
ప్రస్తుతం కేంద్రంలో ఉండి దేశాన్ని ఇద్దరు నేతలు నడుపుతున్నారని, అయితే వీరిలో అసలు నేతపూవరో తెలియడం లేదని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ప్రధాని మన్మోహన్‌లను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ ఇద్దరిలో దేశాన్ని పాలిస్తున్నదెవరో కూడా తెలియడం లేదని అంటూ వీరినుంచి దేశాన్ని విముక్తం చేయడమే మన స్వప్నం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఒకే వ్యవస్థలో ఇద్దరు నేతల అధికారం కూడదని శ్యాంవూపసాద్ ఎప్పుడో నినదించారని, ఆ నినాదం నేటి పరిస్థితులకు కూడా అన్వయిస్తుందని అన్నారు.

దేశం ఇంకెంత మాత్రమూ కాంగ్రెస్ ప్రభుత్వ కొనసాగింపును భరించే స్థితిలో లేదని అంటూ కేంద్రంలోని నిరంకుశ యూపీఏ ప్రభుత్వానికి భరతవాక్యం పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రూపాయి విలువ వేగంగా పతనమవడాన్ని ప్రస్తావిస్తూ పతనంలో రూపాయితో కాంగ్రెస్ పోటీ పడుతోందన్నారు. భారత్ నిర్మాణ్ పేరిట యుపీఏ భారీ ప్రచారంపై మోడీ విమర్శలు సంధించారు. ఆ ప్రకటన ‘ భారత్ కే నిర్మాణ్ పే హక్ హై మెరా’ అంటున్నదని, కానీ తాను ‘భారత్ కే నిర్మాణ్ పే శక్ హై మెరా’ అని తన అనుమానాలు వ్యక్తం చేశానని చెప్పారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.