వలస నేతల కుట్రలను తిప్పికొట్టాలి : కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్న వలస నేతల కుట్రలను తిప్పికొట్టాలని కేసీఆర్ తెలంగాణవాదులకు పిలునిచ్చారు. ఓట్లు దండుకోవడానికి మాత్రమే పాదయాత్రలు కానీ, తెలంగాణ సమస్యల కోసం కాదని స్పష్టం చేశారు. అందరికీ పట్ల సమన్యాయం పాటిస్తామని చెప్పే విజయమ్మ ఎస్‌ఎల్‌బీసీపై ఎందుకు మాట్లాడదు అని ప్రశ్నించారు. కడప రిమ్స్ వెలిగిపోతుంటే, బీబీనగర్ నిమ్స్‌లో దీపం పెట్టే దిక్కే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ సమస్య పట్టి పీడిస్తుంటే, పాలమూరు జిల్లాలో వలసలు పెరుగుతున్నాయన్నారు. మన నీళ్లు మనకు ఉంటే ఫ్లోరైడ్ సమస్య పట్టిపీడించేదా, వలసలు పెరిగేవా అని ప్రశ్నించారు. సీమాంధ్ర పాలనలో తమకు న్యాయం జరగదన్నారు. తెలంగాణ సాధించే వరకు విశ్రమించకుండా పోరాడాలని పిలపునిచ్చారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.