వర్మ సిఫార్సులన్నింటినీ ఆమోదించాం:చిదంబరం

న్యూఢిల్లీ : మహిళలపై లైంగిక నేరాలు తీవ్రమైన సమస్య, అందరూ సున్నితంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి చిదంబరం పేర్కొన్నారు. జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులన్నింటినీ ఆమోదించామని ఆయన తెలిపారు. వర్మ కమిటీ కీలక సిఫార్సులను తిరస్కరించామని అనడం సరికాదన్నారు. బిల్లులోని జటిలమైన అంశాలను చర్చల ద్వారా పరిష్కారిస్తామని తెలిపారు. లైంగిక నేరాలపై చట్టం రూపకల్పనకు పార్లమెంట్‌లో అందరూ సహకరించాలని ఆయన కోరారు. లైంగిక నేరాలపై తక్షణమే కొత్త చట్టం అవసరమని గుర్తించాం, అందుకే ఆర్డినెన్స్ తెచ్చామని చెప్పారు. పార్లమెంటరీ పద్దతిలోనే బిల్లును చట్టరూపంలోకి తెస్తామని తెలిపారు. క్రిమినల్ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉందన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.