వరంగల్ లో సీమాంధ్ర బస్సులు ధ్వంసం

నల్లగొండ-విజయవాడ హైవేపై నీళ్లొచ్చినయని కోదాడ నుంచి వర్ధన్నపేట, జనగామ మీదుగా హైదరాబాద్ కు రూటు మార్చిన్రు. బట్టుపల్లిలో పండ్లపుల్ల వేసుకుని హోటల్ కాడ మాట్లాడుకుంటున్న గ్రామస్తులకు అన్ని రంగురంగుల బస్సులు కనబడ్డయి. అరె ఇవ్వి జగన్ సభకు పొయ్యే వెహికిల్స్ అని అనుమానం వచ్చిన గ్రామస్తులు ఓ బస్సును ఆపి డ్రైవర్ ను  అడిగితే అటే పోతానమని చెప్పిండు. గంతే పండ్లపుల్ల కిందపడ్డది,. పిడికిలి బిగిసింది. జై తెలంగాణ నినాదాలు దద్దరిల్లినయి. మహిళలు, పిల్లలు , పెద్దలు ఆంత కూడి జై తెలంగాణ నినాదాలు చేసిన్రు.

సీమాంధ్ర జనాన్ని ఏమనకుండా కేవలం జై తెలంగాణ నినాదాలు చేస్తున్న ప్రజలను పోలీసులు గెలికిన్రు. దెబ్బ పీకితే బస్సులు బద్దలైనయి. దాదాపు 10 బస్సులకు ఎక్కువనే పలిగిపోయినయి. సభకు వెళ్లే జనాన్ని మాత్రం వరంగల్ బిడ్లలు ఏమనలేదు. ఎలాగూ వీడ్కోలు సభ కదా అని శాంతం వహించిన్రు. హౌలాగాళ్లు కాకపోతే వరంగల్ మీదికెళ్లి పోవుకుంట జగన్ సభకు పోతానమని చెప్తారు? అప్పటికీ భయపడ్డ సీమాంధ్రులు బ్యానర్లన్నీ పీక్కొని బస్సుల పెట్టుకున్నరు. కానీ వరంగల్ వాళ్ల కంట్లెపడి దూల తీర్చుకున్నరు. ఏదో వీడ్కోలు సభ అని ఊరుకున్నరు లేకపోతే వీపులు విమానం మోత మోగేవి.

 

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.