వట్టి వ్యాఖ్యలపై పొన్నాల అభ్యంతరం

హైదరాబాద్: అసెంబ్లీలో ముసాయిదా బిల్లుపై మంత్రి వట్టి వసంతకుమార్ గురువారం చేసిన ప్రసంగంపై తెలంగాణ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అభ్యంతర వ్యక్తం చేశారు. వట్టి పదేపదే మేము మేము అంటూ మాట్లాడటాన్ని పొన్నాల తప్పు పట్టారు. మంత్రి తన అభివూపాయాన్ని అందరి అభివూపాయంగా వక్రీకరించటం తగదని స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కకు సూచించారు. రికార్డుల్లోంచి మేము అనే పదాలను తీసివేయాలని కోరారు. దాంతో అధికార, విపక్ష సభ్యుల నుంచి నవ్వులు విరిశాయి.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.