వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఖతం-టీఆర్ఎస్ కు 13 ఎంపీస్థానాలు

(పోరుతెలంగాణ శ్రీనివాస్):  2014 లోనైనా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా యూపీఏ ప్రభుత్వం పతనమైతదని టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే తేల్చిచెప్పింది. కాంగ్రెస్ ను ప్రజలు ఖతం చేస్తరని తేల్చింది. ప్రజాకంఠక పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ కు ఇక దేశంలో పుట్టగతులుండవని సర్వే తేల్చింది. బీజేపీకి కచ్చితమైన మెజారిటీ వస్తదని, అధికారం చేపడ్తదని సర్వే రిపోర్ట్. థర్డ్ ఫ్రంట్ ఏర్పడినా 117 స్థానాలు మించదని చెప్పింది.

ఇక తెలంగాణను నిండముంచిన కాంగ్రెస్-4, టీడీపీకి 5 సీట్లు మాత్రమే వస్తయని.. రాష్ట్రవ్యాప్తంగా మట్టికొట్టుకపోతదని టైమ్స్ పేర్కొన్నది. తెలంగాణ ప్రజలు ఉద్యమపార్టీ టీఆర్ఎస్ కు అత్యధికంగా 13 సీట్లు కట్టబెడ్తరని తేల్చింది.   ఏపీలో లోక్‌సభ సీట్లు ప్రస్తుతం కాంగ్రెస్‌కు 33 సీట్లు ఉండగా అవి నాలుగుకు పడిపోనున్నట్టు వెల్లడించింది. టీడీపీ-5,  సీమాంధ్రలో వైఎస్సార్సీపీ-19 సీట్లు గెలుచుకుంటయని తెలిపింది.

తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ కు 15 స్థానాలు కట్టబెడితే.. జయశంకర్ సార్ చెప్పినట్టు యాచించి కాకుండా శాసించి తెలంగాణ సాధించుకోవచ్చు. డీఎంకే యూపీఏను ఆగం చేస్తున్నట్టు.. ములాయం కాంగ్రెస్ ను ఆడిస్తున్నట్టు.. మనం కూడా కేంద్రాన్ని ఆటాడించి బాజాప్తుగా తెలంగాణ తెచ్చుకోవచ్చు.. ఇక మనం రిజైన్ చేయమని వేరే పార్టీవాళ్లను బతిమిలాడాల్సిన అవసరం ఉండదు. రాజకీయంగా తెలంగాణ ద్రోహులకు ఓటు ద్వారా బుద్ధి చెప్పి.. తెలంగాణ తడాఖా చూపిద్దాం..

ఎలాగూ సర్వేలు 13 సీట్లు వస్తయని చెప్పినయి కదాని.. సైలెంట్ అయిపోతే ఆ సంఖ్య పడిపోయే అవకాశముంది. ఎన్నికలను కూడా ఉద్యమంలాగా భావిస్తేనే సీట్లు పెరుగుతయి. గ్రామస్థాయిలో టీఆర్ఎస్ మరింత బలపడాల్సిన అవసరమున్నదని విశ్లేషకులు చెప్తున్నరు. ఇప్పటి నుంచే నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు చేరువయితే మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలంగాణవాదులు అంటున్నరు. తెలంగాణవాదుల కోరికను టీఆర్ఎస్ మన్నించి.. గ్రామ, మండల, పట్టణ స్థాయిలో టీఆర్ఎస్ బలాన్ని పెంచుకొని.. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని  పోరుతెలంగాణ  కోరుతున్నది.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.