వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే

తెలంగాణలో రాష్ట్రంలో తొలి ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దేనని ఎమ్మెల్యే కేటీఆర్ ఆశాభా వం వ్యక్తం చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి ఉగ్గుపాలందించిన కరీంనగర్ జిల్లా నుంచే కేసీఆర్ ఎన్నికల శంఖరావాన్ని ప్రారంభించబోతున్నారన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 60 సీట్లకుపైగా వస్తాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పేదలకు, నేత, గీత, బీడీ కార్మికులతో పాటు దళితులకు తగిన న్యాయం చేసేందుకు కేసీఆర్ రూపొందించిన పార్టీ మ్యానిఫెస్టోనే నిదర్శనమన్నారు.

-60కిపైగా ఎమ్మెల్యే స్థానాల్లో గెలుస్తాం
-మూడేళ్లలో ప్రాణహిత-చేవేళ్ల పూర్తి చేస్తాం
-సిరిసిల్లలో పవర్‌లూం మెగాక్లస్టర్: కేటీఆర్

తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటగా సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు మెగాపవర్‌లూం క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. నేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ, ఆరోగ్యబీమా కల్పిస్తామన్నారు.

taraka

ఎగువ మానేరు ఎత్తిపోతల పథకంతో సిరిసిల్లను సస్యశ్యామలం చేయడానికి చేపట్టిన ప్రాణహిత-చేవేళ్ల పనులను మూడేళ్లలో పూర్తిచేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, చట్టబద్ధపాలన, విద్య,వైద్య ఆరోగ్య క్రీడావిభాగాలతో పాటు అన్ని రంగాలను అభివద్ధి చేసేందుకు కషి చేస్తామన్నారు. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహిస్తున్న ఎన్నికల సభకు తెలంగాణవాదులు భారీ గా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.