వందేళ్ల పత్రికకు వందనం

నిజాం పాలనలో తెలంగాణవ్యాప్తంగా దిన, వార, మాస పత్రికలు చాలా గొప్పవిగా పత్రికారంగ చరివూతలో నిలిచిపోయాయి. తొలి తెలుగు పత్రిక శేద్యచంవూదిక 19వ శతాబ్ది చివర్లో వెలువడింది. అయితే పూర్తిస్థాయి లక్షణాలు కలిగిన పత్రికకు మాత్రం పాలమూరు జిల్లానే జీవం పోసింది. జన హితమే పరమావధిగా, సంఘ సంస్కరణే లక్ష్యంగా ప్రారంభమైన ‘హితబోధిని’ తొలి సంచిక వెలువడి జూన్ 13కు వందేళ్లవుతోంది. ఆయుర్వేద వైద్యుడు బి. శ్రీనివాసశర్మ, బి. రామచంవూదరావు ఈ పత్రికను స్థాపించి పత్రికారంగ ప్రస్థానంలో తొలి అడుగులు వేశారు. 1913 జూన్ 13న వెలువడిన పత్రిక మొదటి సంచికలో ‘ప్రారంభము’ అనే శీర్షిక కింద పత్రిక స్థాపనలో తమకు ఎదురైన కష్ట, నష్టాలను, పలువురు అందించిన సహాయాన్ని ప్రస్తావించారు. ‘ఈ పత్రిక ప్రచురణ అనే సత్కార్యానికి సహాయమొనర్చుటలో వనపర్తి, కొల్లాపురం మున్నగు సంస్థానములకు విజ్ఞాపనలు చేశాం. ఎవరి నుంచి జవాబులు రాలేదు. అయితే ఆత్మకూరు సంస్థానాధీశులైన రాజా శ్రీరామ భూపాల బహరీ బలవంత్ బహద్దూర్ గారిని కలుసుకుని మా ప్రయత్నాన్ని వివరిస్తే ముద్రణ యంత్రాన్ని దానంగా ఇస్తామని హామీ ఇచ్చారు’ అని పేర్కొన్నారు. పత్రిక ముద్రణకు కావాల్సిన యంత్రాన్ని రాజావారు ఇవ్వడంతో ఆయనను రాజపోషకుడిగా పత్రికలో ప్రస్తావించారు. అంతేగాక పత్రిక స్థాపనలో వకీలు శేషాచార్యులు, చించోళి నరహరిరావు పంతులు, సన్నవాడ దేశ్‌ముఖ్ రామాడ్డి, మహ్మదాబాద్‌కు చెందిన లింగాడ్డి, గడ్డంపల్లి రామాచంవూదాడ్డి దేశ్‌ముఖ్, తరిణికల్ తహసీల్దార్ ప్రతాపడ్డి సాయం చేశారు. నిజాం వ్యవసాయ శాఖాధికారి జాన్‌కెన్నీ స్కోయర్, రెవెన్యూ అధికారి విక్ఫీల్డ్ ప్రోత్సాహమిచ్చారు. సాయమందించిన ఏ ఒక్కరిని మరిచిపోకుండా పేరుపేరునా ప్రస్తావించారు. పత్రిక సంవత్సర చందా ఐదు రూపాయలుగా నిర్ణయించారు. స్త్రీలకు, విద్యార్థులకు 3 రూపాయలే నిర్ణయించడం పత్రిక స్థాపనలో వారి లక్ష్యాన్ని తెలియజేస్తోంది. శ్రీనివాసశర్మ తన కూతురి పేరుతో ఏర్పాటు చేసిన సరోజినీ విలాస్ ప్రెస్, మహబూబ్‌నగర్, నైజాం అనే చిరునామాతో పత్రిక వెలువడింది.
పత్రిక నిర్వాహకులు నాలుగు అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నారు. వ్యవసాయం, వైద్యం, పారివూశామికీకం, సంఘ సంస్కరణంపై అంశాలవారీగా వ్యాసా లు రాసేవారు. శ్రీనివాసశర్మ స్వయంగా ఆయుర్వేద వైద్యుడు కావడంతో ఆయన వైద్యానికి సంబంధించిన వ్యాసాలు రాసేవారు. ఏడాదిలో వచ్చిన సంచికలను ఈ నాలుగు అంశాలవారీగా విడదీసుకుని ప్రత్యేక పుస్తకాలుగా బైండ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉందని, ఆంధ్ర ప్రాంతంలోగానీ, చెన్నపట్టణంలోగానీ ఏ పత్రికాధిపతులు ఇలాంటి ప్రయోగం చేయలేదని సీనియర్ పాత్రికేయులు పొత్తూ రి వెంక తన గ్రంథంలో హితబోధిని వ్యవస్థాపకులను కొనియాడారు. సంఘసంస్కరణాభిలాషతో రత్నమాంబ దేశాయి శార్దులం, కంద, తేటగీతి, ఆట పద్యాలు రాశారు. అంతేగాక పాలమూరుకు చెందిన ఎస్. సుందరీభాయి స్త్రీ విద్య గురించి ఇందులో వ్యాసం రాశారు. ఈమెనే తెలంగాణలో తొలివ్యాసకర్తగా ప్రముఖ పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ తన షబ్నవీస్ గ్రంథంలో పేర్కొన్నారు. 1950లో సురవరం ప్రతాపడ్డి తెలంగాణ తెలుగు పత్రికలు అనే అంశంపై వ్యాసం రాస్తూ ‘ఈ తెలంగాణములో మొదటి తెనుగు పత్రిక ‘హితబోధిని’ అని పిడికెడు మందికి మాత్రమే తెలియును. నా వద్ద హితబోధిని మాసపవూతిక నాల్గవ సంచిక కలదు. అది సెప్టెంబర్ 1913 నాటిది. ఆయన కాలం నాటికే ఈ పత్రిక సంచికలు అనేకం అలభ్యంగా ఉండిపోయాయి. శతాబ్దం తర్వాత ప్రస్తుతం రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో ఒక సంచిక, అడుగునపడ్డ తెలంగాణ చరివూతను తవ్వి రాస్తున్న సంగిశెట్టి శ్రీనివాస్ వద్ద మరో సంచిక ఉంది. అనేక ఇబ్బందుల మధ్య ప్రారంభమైన హితబోధిని నడిచినన్ని రోజులు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. మొదటి నుంచే చందాదారులు సమయానికి చందాలు చెల్లించకపోవడం, ఆర్థిక సాయం చేసేవారు లేకపోవడం, నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో ఆర్థిక భారం మోయలేనిదిగా మారింది. రెండేళ్లు నడిచిన పత్రిక అర్ధంతారంగా ఆగిపోయింది. ‘వీరలోక నాటక మండలి’ అనే డ్రామా కంపెనీ స్థాపించిన శ్రీనివాసశర్మ నాటకాల ద్వారా వచ్చే డబ్బుతో పత్రికను ఎలాగోలా నడపాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఏమైనప్పటికీ పత్రికల గురించి తెలియని ఆ రోజుల్లో పత్రికను పరిచయం చేసి, అనంతర కాలంలో ప్రారంభమైన నీలగిరి, తెనుగు, గోలకొండ పత్రికల నిర్వాహకులకు మార్గదర్శులుగా నిలిచిన శ్రీనివాసశర్మ, రామచంవూదారావు చిరస్మరణీయులు.

-నుగునూతుల యాకయ్య,
తెలుగు పరిశోధక విద్యార్థి, కాకతీయ యూనివర్సిటీ
( ‘హితబోధిని’ పత్రిక వచ్చి వందేళ్లు అవుతున్న సందర్భంగా ..

This entry was posted in ARTICLES.

Comments are closed.