ల్యాంకో, జీఎంఆర్ సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేసిన్రు. ఆ సంస్థల అక్రమాలను బయటపెడ్తామని అన్నరు. సీమాంధ్ర ముఖ్యమంత్రులు ఎవరున్నా తెలంగాణ వనరులు కొల్లగొడుతూ సీమాంధ్ర పెట్టుబడిదారులకు, అస్మదీయులకు దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. పొద్దున లేస్తే తెలుగు ప్రజలని మాట్లాడే లగడపాటి ప్రభుత్వం నుంచి సబ్సిడీ గ్యాస్ కొని రాష్ట్ర ప్రజలకు అధిక ధరకు కరెంటు అమ్ముతున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ల్యాంకో, జీఎంఆర్ సంస్థలకు లాభాన్ని చేకూర్చే విధంగా సీమాంధ్ర ప్రభుత్వం ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రజలపై భారం మోపుతుందని ఆయన చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పెద్ద కుంభకోణం అని అసెంబ్లీ హౌస్ కమిటీ తేల్చిందని, కోర్టు కూడా దానిపై చర్యలకు ఆదేశించినా ప్రభుత్వం మెతక వైఖరి అవలంభిస్తుందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో నామమాత్రపు ధరలకే నాలుగు కంపెనీలను ప్రైవేటు యాజమాన్యాలకు కట్టబెట్టిండని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం లాంకో, జీఎంఆర్ సంస్థలపై చర్యలు తీసుకోకపోతే కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
ల్యాంకో, జీఎంఆర్ లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి-కేటీఆర్
Posted on February 15, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.