‘ల్యాంకో, జీఎంఆర్‌లపై కేసులు పెట్టాలి’

హైదరాబాద్ : విద్యుత్ విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేసిన ల్యాంకో, జీఎంఆర్‌లపై తక్షణమే కేసులు పెట్టాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. సింగరేణి ఈఆర్సీ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణకు కేటీఆర్, హరీష్‌రావు హాజరయ్యారు. ఎఫ్‌ఎస్‌ఏ, విద్యుత్ ఛార్జీల పెంపు అన్యాయమంటూ వీరిద్దరు వాదనలు వినిపించారు. కేవలం ప్రైవేటు కంపెనీలకు కొమ్ము కాచే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈఆర్సీ గుడ్డిగా ఆమోదించిందని చెప్పారు. విద్యుత్ సమస్యలపై ఆందోళనకు దిగిన హరీష్‌రావు, కేటీఆర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.