ల్యాంకో కేసు వదులుకున్నట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా: హరీశ్

ల్యాంకోహిల్స్‌పై పెట్టిన కేసును డబ్బులు తీసుకుని ఉపసంహరించుకున్నట్లు రుజువు చేస్తే ఇదే అసెంబ్లీ ముందు ముక్కుకు నేలకు రాస్తానని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లికి టీఆర్‌ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్‌సవాల్ విసిరారు. ‘ఒకవేళ రుజువు చేయకపోతే నువ్వు ముక్కు నేలకు రాస్తావా?’ అని ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్, టీడీపీ సీమాంధ్ర పార్టీలేనని అన్నారు. ఈ సీమాంధ్ర పార్టీలో తెలంగాణ వారికి సరైన స్థానం కల్పించడం లేదని హరీశ్ విమర్శించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.