లోక్ సభలో మార్మోగిన తెలంగానం

తెలంగాణ విషయంలో మోసపూరిత వైఖరి ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు.  లోక్‌సభలో కేసీఆర్ తెలంగాణవాణిని వినిపించిన్రు.. తెలంగాణ రాష్ట్రం ఇస్తమని కేంద్రం మూడేళ్ల క్రితమే ఇదే సభలో చెప్పిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాటను నిలుపుకోకుండా కేంద్రం వెనక్కిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇవ్వడం దోసె వేసినంత సులువు కాదని కాంగ్రెస్ నేతలనడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ మోసానికి గుండె చెదిరి వెయ్యిమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని సభలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా కేసీఆర్, విజయశాంతి సభ నుంచి వాకౌట్ చేశారు. స్పీకర్ తన ఛాంబర్‌కు పిలిపించుకుని సముదాయించినా కేసీఆర్ పట్టువీడలేదు.
ఇటు కేంద్రంలోను, అటు రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీని ప్రజలు సస్పెండ్ చేసే రోజు దగ్గర్లోనే ఉన్నదని కేసీఆర్ స్పష్టం చేశారు. వెయ్యిమందికి పైగా ఆత్మబలిదానాలు చేసుకుంటే వయలార్ రవి, ఆజాద్ లాంటి నాయకులు తెలంగాణపై బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. నెలంటే 30 రోజులు కాదని, తెలంగాణ దోశ వేసినంత ఈజీ కాదనే వ్యాఖ్యలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెపుతారని ఆయన చెప్పారు

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.