లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలకు నగరా మోగింది. జనరల్ ఎన్నికలు -2014 షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 9 విడతల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. జూన్ 1 నాటికి ప్రస్తుత లోకసభ(15వ) కాలపరిమితి ముగియనున్నందున మే 31నాటికి కొత్త ప్రభుత్వం కొలువుదీరేలా ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ తయారు చేసింది. ఏప్రిల్ 16న మొదలయి మే 13న ఎన్నికలు ముగియనున్నాయి. మే 16న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

లోకసభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో లోకసభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఏప్రిల్ 30న(7వ విడత), సీమాంధ్రలో మే 7న(8వ విడత) పోలింగ్ జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

tracar

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వివరాలు
* ఏప్రిల్ 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
* ఏప్రిల్ 9న నామినేషన్ల సీకరణకు చివరితేదీ
* ఏప్రిల్ 10న నామినేషన్ల పరిశీలన
* ఏప్రిల్ 12న నామినేషన్ల ఉపసంహరణ
* ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహణ
* మే 16న ఓట్ల లెక్కింపు.

సీమాంధ్రలో ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
* ఏప్రిల్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
* ఏప్రిల్ 19న నామినేషన్ల స్వీకరణకు చివరితేది
* ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన
* ఏప్రిల్ 23న నామినేషన్ల ఉపసంహరణ
* మే 7న పోలింగ్ నిర్వహణ
* మే 16న ఓట్ల లెక్కింపు.

tracar

పరీక్షలను దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్ రూపకల్పన
ఎన్నికల షెడ్యూల్‌పై అన్ని రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సంప్రదించాం. వివిధ రాష్ర్టాల్లో విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందించామని తెలిపారు.

ఓటురు నమోదుకు మరో అవకాశం
ఓటరుగా నమోదు చేసుకునేందుకు వయోజనులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు వీఎస్ సంపత్ తెలిపారు. ఓటరుగా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 9న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు ప్రక్రియ జరగనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 9న బూత్ స్థాయి అధికారులు దరఖాస్తులతో అందుబాటులో ఉంటారన్నారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.