లోక్‌పాల్ బిల్లుకు లోకసభ ఆమోదం

డిసెంబర్ 18:  సుదీర్ఘ కాలం.. ఎన్నో అడ్డంకులు..అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ఓ ముందడుగు పడింది. ఎట్టకేలకు లోక్‌పాల్ బిల్లు పార్లమెంటు ఉబయసభల్లో పాస్ అయింది. నిన్న రాజ్యసభ గ్రీన్ సిగ్నలివ్వగా ఇవాళ లోకసభ ఆమోద ముద్ర వేసింది. దీంతో చరిత్రాత్మకమైన లోక్‌పాల్ బిల్లుకు చట్టబద్ధత కలిగింది. అవినీతి నిరోదక జవాబుదారి వ్యవస్థ(అంబుడ్స్‌మన్) ఏర్పాటుకు ఒక ముందడుగు పడింది.
వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్‌సభలో చర్చ అనంతరం లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందింది. లోక్‌పాల్ బిల్లును బీజేపీ ఇతర పక్షాలు సమర్ధించడంతో చరిత్రాత్మకమైన లోక్‌పాల్ బిల్లు సభలో ఆమోదం పొందింది. లోక్‌పాల్ బిల్లును కేంద్రం రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. దీంతో దేశంలో అవినీతి అడ్డుకట్ట ఇది ఒక ముందడుగని సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. లోక్‌పాల్ బిల్లును వ్యతిరేకిస్తూ ఎస్పీ, శివసేన సభ్యులు వాకౌట్ చేశారు. ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి తేవడం మంచిది కాదని శరద్‌యాదవ్ అభిప్రాయపడ్డారుపధాని పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండాలని శరద్ యాదవ్ పేర్కొన్నారు. నిన్న రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే.

సంబరాల్లో అన్నా బృందం
రాలేగావ్‌సిద్ధిలో అన్నా హజారే దీక్ష శిబిరం వద్ద సంబరాలు వెల్లువిరుస్తున్నాయి. ఉభయసభల్లో లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందడంతో అన్నా మద్దతుదారులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. దేశంలో అవినీతి అరికట్టడానికి లోక్‌పాల్ బిల్లు కోసం అన్నాహజారే పోరాడుతున్న విషయం తెలిసిందే. లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందడంతో ఆయన దీక్ష విరమించారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.