లోకేష్..ఇదీ మీ బాబు తెలంగాణ !

మా పార్టీ తెలంగాణకు అనుకూలం.. అని టీడీపీ శ్రేణులు మురిసిపోతున్న సమయంలో ఓ ఝలక్! మనసులో అసలు మాట బయటకు వచ్చేసిందా? ఓ అనుమానం! ఈ ఫొటోల సమాహారం వరంగల్ జిల్లా చిట్యాల మండలం గ్రామంలో శనివారం రాత్రి కెమెరాకు చిక్కినది! టీడీపీ తెలంగాణకు జై కొట్టిందన్న సంబురంలో ఉన్న కొందరు మహిళలు ఆనందోత్సాహాలతో బోనాలు పట్టుకుని వచ్చారు. కొన్నింటిపై జై తెలంగాణ అని రాసి ఉండగా.. మరికొన్నింటిపై జై తెలుగుదేశం అని రాసి ఉంది! ఒక మహిళ జై తెలంగాణ అని రాసి ఉన్న బోనాన్ని చంద్రబాబుకు ఇవ్వగా ఆయన దాన్ని తలకెత్తుకుని ఇబ్బందికరంగా ముఖం పెట్టుకున్నారు. ఆ వెంటనే జై తెలంగాణ అంటూ పరిసరాలు మార్మోగాయి! వెంటనే తేరుకున్న చంద్రబాబు.. ఆ బోనాన్ని దించి.. ఇతర మహిళలు తెచ్చిన బోనాల్లో జై తెలుగుదేశం అని రాసి ఉన్న బోనం ఏదో వెతుక్కుని మరీ దానిని నెత్తినపెట్టుకున్నారు! అప్పటిదాకా ఇబ్బందికరంగా ఉన్న ఆయన ముఖం.. జై తెలుగుదేశం అని ఉన్న బోనాన్ని ఎత్తుకోగానే చిరునవ్వుతో వెలిగిపోయింది! జై తెలంగాణ అని నినాదాలు ఇచ్చిన శ్రేణుల ముఖం చిన్నబోయింది! లోకేష్.. ఇదీ మీ నాయన ‘జై తెలంగాణ’!

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.