లొల్లికి చెల్లు-ఢిల్లీకి బిల్లు

తెలంగాణ బిల్లు.. దశాబ్దాల ఆకాంక్షల రెక్కలు విప్పుకొంది! కోటి రతనాల వీణ చేస్తున్న విజయరాగాలాపనల నేపథ్యంలో తుది మజిలీకి దక్కులు సారించింది! సభాసాక్షిగా సాగిన కుతంత్రాలను అధిగమించి.. తొండి యత్నాలను పిండి చేసి.. లొల్లికి చెల్లుచీటి ఇచ్చేసి.. సమైక్య శాసనసభ ఆధిపత్య బంధనాల నుంచి ఎగిరిపోయింది! ఖాళీ మైదానాన్ని.. కొరగాని తీర్మాన పత్రాలను సీమాంధ్ర నేతలకు వదిలేసి.. దేశ ప్రథమపౌరుడు కోరిన సభ అభిప్రాయాన్ని మాత్రం మోసుకుని.. రాష్ట్రపతి భవన్‌కు ప్రయాణంకానుంది! రాష్ట్రపతి ఆదేశం మేరకు సభ తన అభిప్రాయం చెప్పిందన్న స్పీకర్ నాదెండ్ల ప్రకటనతో.. ఇక బిల్లు ఢిల్లీ సొత్తు! వెయ్యి మందికిపైగా బంగారాల్లాంటి తెలంగాణ బిడ్డల అమరత్వం ఆశించిన ప్రతిఫలం..
asemblyఇప్పుడు కేంద్రం చేతుల్లో! మాట తప్పేది లేదంటున్న కేంద్రం.. ఆ ప్రతిఫలాన్ని నాలుగు కోట్ల మంది ప్రజల చేతికి అప్పగించేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది! మిగిలింది చిన్నపాటి లాంఛనాలే! మరో ఇరవైనాలుగు గంటలు గడిస్తే.. అవీ పూర్తి చేసుకుని.. తెలంగాణ బిల్లు రాష్ట్రపతికి అందనుంది! ప్రథమపౌరుడు తలూపడమే ఆలస్యం.. బిల్లును పార్లమెంటులో పెట్టి.. ఆమోదింపజేసేందుకు యూపీఏ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది! ఇక ఎవరెన్ని ఎత్తులు వేసినా.. ఇంకెన్ని జిత్తులు పారించినా ఫరక్ నై పడ్తా! పూర్తి రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ప్రాంతం..
దేశ చిత్రపటంలో మళ్లీ రాష్ట్ర హోదాతో ఆత్మగౌరవ పతాకాన్ని రెపరెపలాడించనుంది!!

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.