లాలూకు ఎదురుదెబ్బ!

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకేసును మరో సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీచేయాలని, మరికొందరు సాక్షులను ప్రశ్నించాలని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు రద్దు చేసింది. ఈ కుంభకోణం కేసుపై జూలై 15న తుది తీర్పురాబోతున్న నేపథ్యంలో కేసు బదిలీని కోర్టు అంగీకరించలేదు. తనపై నమోదైన కేసు ఆర్సీ20ఏను ప్రస్తుతం విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ప్రవాస్‌కుమార్ ధర్మాసనం నుంచి మరో చోటుకు మార్చాలని, ఈ కోర్టునుంచి తనకు న్యాయం జరగదని లాలూ, ప్రముఖ న్యాయవాది రాంజె కలిసి గతవారం పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 28న దీనిపై జరిగిన వాదోపవాదాలు పరిశీలించిన ఆర్‌ఆర్ ప్రసాద్‌తో కూడిన ఏకసభ్య ధర్మాసనం అప్పుడు తీర్పు వెలువరించకుండా రిజర్వులో పెట్టింది. సోమవారం ఆయన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పు చెప్పింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.