లక్షమంది చంద్రబాబు, జగన్‌బాబు, కిరణ్‌బాబులు వచ్చినా తెలంగాణను ఆపలేరు-కేసీఆర్

తెలంగాణ ప్రజల పోరాటంలో ధర్మం, న్యాయముందని కేసీఆర్ తెలిపారు. ర్కొన్నారు. కిరణ్ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణతో గోక్కున్నోడెవడూ ఇప్పటి వరకూ ముందర పడలేదని చెప్పారు. మానసికంగా ఆంధ్ర, తెలంగాణ ఎప్పుడో విడిపోయామన్నారు. చంద్రబాబు బతుక్కు ఎన్ని టర్నులు ఉన్నాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తున్నప్పుడు ప్రజలు చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రాలేదన్నారు. తెలంగాణ ప్రకటన వచ్చిన మరుక్షణమే సీమాంధ్ర పార్టీ నేతలు ఊసరవెల్లుల కంటే వేగంగా రంగులు మార్చారని ఎద్దేవా చేశారు. లంకలో పుట్టినవన్నీ రాక్షసులే నన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు రూ. ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలంటున్నారు. ఎదైనా ప్యాకేజీ ఇస్తే తెలంగాణకే ఇవ్వాలన్నారు. సమైక్యాంధ్ర సభలో పోలీస్ శ్రీనివాస్‌ను ఎలా కొడతారని ప్రశ్నించారు. రోజు సమైక్యాంధ్ర అంటున్న సీఎంను ఎన్ని దెబ్బలు కొట్టాలన్నారు. గడ్డి, కోడి ఈకలు తినడం, పార్లమెంట్‌లో కొరడాతో కొట్టుకోవడం ఉద్యమమా అని అడిగారు. తనకున్న సమాచారం ప్రకారం సీఎం కిరణ్ అక్టోబర్ 6 వరకే కొనసాగుతాడని కేసీఆర్ తెలిపారు. ఆరిపోయే దిపానికి వెలుగెక్కువ అన్నట్లు సీఎం కిరణ్ ప్రవర్తిస్తున్నాడని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
ఈ సున్నిత సమయంలో సీఎంగా ఉన్న వ్యక్తి ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు. దేశంలోని అనేక పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉన్న బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో అనుమానం వద్దని చెప్పారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ సాధించుకుందామని, యువకులు ధైర్యం కోల్పోవద్దని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌పై కిరికిరి పెడితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

మాది బతుకు పోరాటం: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రకటనను ఆపేందుకు సీమాంధ్ర పాలకులు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రజలది బ్రతుకు పోరాటమన్నారు. దోపిడీకి, న్యాయానికి మధ్య జరుగుతున్న పోరాటమిదని ఆయన అభివర్ణించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉందని, తెలంగాణలో దాదాపు 50 లక్షల హెక్టార్ల వ్యవసాయభూమి నిరుపయోగంగా వుందన్నారు. ఆంధ్ర నుంచి నూటికి ఒక్కరు మాత్రమే హైదరాబాద్ వస్తున్నారని ఆయన అన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్‌లో ఎవరికీ ఇబ్బంది లేదు:
తెలంగాణ ఏర్పడినంత మాత్రానా హైదరాబాద్‌లో ఎవరికీ ఇబ్బంది లేదని కోదండరాం అన్నారు. సీఎం అబద్దాల ప్రచారం విని సీమాంధ్ర ప్రజలు మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణను ఇక ఎవరూ అడ్డుకోలేరని ఆయన వెల్లడించారు. బిల్లుపెడితే బీజేపీ మద్దతు ఇస్తుందని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన రెండు ప్రాంతాలకు ఉపయోగకరమన్నారు. విడిపోతే ఆంధ్రప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశముందన్నారు. ఆంధ్ర పాలకుల పెత్తనం త్వరలోనే కూలిపోతుందని ఆయన పేర్కొన్నారు. మీడియాలో ఒక వర్గం సీమాంధ్ర పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు.

తెలంగాణను ఎవరూ అపలేరు: కేకే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరని టీఆర్‌ఎస్ నేత కేకే అన్నారు. సకల జన భేరి సభలో ఆయన ప్రసంగిస్తూ హైదరాబాద్‌పై కొందరు పెడుతున్న కిరికిరిలు చెల్లవన్నారు. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్నారు.

ఈ సభద్వారా ఢిల్లీ దిగిరావాలి: దేవీప్రసాద్
హైదరాబాద్: తెలంగాణ సకల జనభేరీ సభలో టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ మాట్లాడారు. ఈ సభద్వారా ఢిల్లీ దిగి రావాలన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె ఎందుకు చేస్తున్నారో వాళ్లకే తెలియదన్నారు. సకల జనుల సమ్మెలో టీ ఉద్యోగులపై ఉక్కుపాదం మోపారని, సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను ప్రభుత్వమే దగ్గరుండి నడిపిస్తుందని ఇది ప్రభుత్వ వివక్ష కాదా అని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు మేం రెడీగా ఉన్నామని తెలిపారు. న్యాయ సూత్రాల ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని తేల్చి చెప్పారు. విభజన అనివార్యం.. దాన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. సభను శాంతియుతంగా నడిపిస్తామని చెప్పారు. ప్రకటనను బిల్లు రూపంలో సాకారం చేసుకుందామన్నారు. పార్లమెంట్‌లో బిల్లు కోసమే ఈ సభ అని తెలిపారు.

సీఎం కిరణ్ నీ ఉద్యోగం పోతుంది: విఠల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన వారి ఉద్యోగాలు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉద్యోగం తప్ప సీమాంధ్ర సామాన్య ప్రజలకు జరిగే నష్టమేమి లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత విఠల్ తెలిపారు. 1956 లో ముల్కీ నిబంధనలు అమలు చేయకుండా 24 వేల ఉద్యోగాలు కొల్లగొట్టారని తెలిపారు. 1972లో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడం కుట్ర కాదా అని ప్రశ్నించారు. గిర్‌గ్లానీ కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదని అడిగారు. తెలంగాణ ఏర్పడితే ఒక లక్షా యాభైవేల మంది ఉద్యోగులు వెళ్లాల్సి వస్తుందని కిరణ్‌కుమార్‌రెడ్డి ఒప్పుకున్నాడని చెప్పారు.

‘ఒప్పందాల ఉల్లంఘనే తెలంగాణ ఉద్యమానికి నాంది’
హైదరాబాద్: ఒప్పందాల ఉల్లంఘనే తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిందని టీ జేఏసీ కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య తెలిపారు. నగర శివారు భూములు కబ్జా చేశారని పేర్కొన్నారు. మీరు బిల్డింగుల్లో ఉంటే మేం గుడిసెల్లో ఉంటే అభివృద్ధి ఎలా అవుతుందని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో నిర్మించిన నగరమని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రకు జరిగే నష్టం ఒక్కటి చెప్పండని అడిగారు. తెలంగాణకు జాతీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయని తెలిపారు. సీమాంధ్ర జేఏసీకి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వం వహించాలని అనుకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

‘కుట్రలను సీమాంధ్ర ప్రజలు గమనించాలి’

హైదరాబాద్: పెట్టుబడి దారుల కుట్రలను సీమాంధ్ర ప్రజలు గమనించాలని టీ జేఏసీ నేత శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డమీద జై తెలంగాణ అంటే కానిస్టేబుల్‌పై దాడి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ పైనే సీమాంధ్ర నేతల ప్రేమ తప్ప అక్కడి ప్రజలపై కాదని తెలిపారు. తెలంగాణ వస్తే పెట్టుబడిదారులు ఆక్రమించిన భూముల బండారం బయటపడుతుందనే తెలంగాణను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను గుప్పిట్లో పెట్టుకునేందుకు పెట్టుబడిదారులు కుట్ర చేస్తున్నారన్నారు. సీమాంధ్రలో దళితులు, కవులు, కళాకారులు విభజన కోరుకుంటున్నారని చెప్పారు. శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర ఏజెన్సీలో మహిళలు కష్టాలు కనిపించవా అని ప్రశ్నించారు. పాలకులే ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఔటర్ రింగ్‌రోడ్‌లో పెట్టుబడిదారులకు వేల ఎకరాల భూములున్నాయని పేర్కొన్నారు. సీమాంధ్రలో సామాన్య ప్రజానీకం అభివృద్ధి చెందారా అని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలను మోసం చేసి తెలంగాణకొచ్చి పెట్టుబడి దారులు పెత్తనం చేస్తున్నారని చెప్పారు. సీమాంధ్ర యువత హైదరాబాద్‌లో స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు. 400 ఏళ్ల చరిత్రగల హైదరాబాద్‌ను ఇక్కడి ప్రజలే అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. సీమాంధ్ర పాలనలో కూకట్‌పల్లి, వనస్థలిపురం అభివృద్ధి చెందాయని చెప్పారు. ఇక్కడి సీమాంధ్ర ప్రజలకు మేం అండగా ఉంటామని చెప్పారు. తెలంగాణ కల సాకరమయ్యే వరకు శాంతియుతంగా ఉద్యమం చేస్తామని తెలిపారు. మా ఉద్యమ నేతలను అవమానించినా భరించామన్నారు. మేం దాడులు చేయాలనుకుంటే గంటలోపే దాడి చేయగలం కాని మా పద్ధతి అది కాదని చెప్పారు.
DSC_0507
DSC_0509
DSC_0513
DSC_0516
DSC_0520
DSC_0521
DSC_0525
DSC_0527
DSC_0530
DSC_0520
DSC_0518

DSC_0162
DSC_0180
DSC_0318
DSC_0343
DSC_0344
DSC_2115
DSC_2112
DSC_0416
DSC_0468
DSC_0472
DSC_0515

OtherNews..
This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.