రైతులను ఆదుకుంటామన్న గవర్నర్-అవాక్కయిన అన్నదాతలు

 తుపాన్ ప్రభావంతో పంట నష్టానికి గురైన రైతులను ఆదుకుంటామని గవర్నర్ నరసింహన్ భరోసా ఇచ్చిన్రు. పంట నష్టంపై నివేదిక అందగానే బాధితులకు సాయం చేస్తామని పేర్కొన్నారు. వరద పరిస్థితిపై సీఎం సమీక్షిస్తున్నారని గవర్నర్ తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు.

ఇక్కడే అన్నదాతలు అవాక్కయిన్రు. తమను ఆదుకోవడానికి నరసింహన్ ఏమైనా సీఎమా లేక మినిస్టరా? లేక గవర్నర్ ఫండ్ ల నుంచి పంటనష్టపోయిన తమకు పరిహారం ఇస్తరా అని అనుమానంతో కూడిన ఆశ్చర్యాన్ని వక్తం చేస్తున్నరు.  గవర్నర్ రాజకీయ నేతలాగా బిల్డప్ ఇవ్వడంపై కాంగ్రెస్ లో ఉన్న ఒకటి, అర తెలివిగల నేతలు మండిపడుతున్నరు. ఎక్కదు శ్రీనివాసన్ లక్ష్మి (ESL) నరసింహన్ కు  ఎవరేం చెప్పినా ఎక్కదని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. అయినా గవర్నర్ గిరి చేసుకుంటే నాలుగు గుళ్లు తిరగక నీకెందుకు రాజకీయాలు. గాడిద పడని గాడిద చెయ్యాలె. గుర్రం పని గుర్రం చెయ్యాలె. కిరణ్ పని కిరణ్ను చేసుకోనివ్వు. నీ పని నువ్వు చేసుకో. అట్లనే తెలంగాణ విషయంలో తప్పుడు నివేదికలు ఇచ్చుడు బంద్ చెయ్యి.  ఉన్నదున్నట్టు రిపోర్ట్ ఇయ్యి. నేను చెప్పింది మైండ్ లకు ఎక్కిందా. నీ ఇంటిపేరే ఎక్కదు ఆయే నేను చెప్పింది ఏడ ఎక్కుతది?

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.