రైతులకు యూపీఏ ఏం చేసిందో చెప్పాలి: మోడీ

జార్ఖండ్: కోట్లాది మంది ప్రజల అడుగులతో ముందుకు వెళ్లినపుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. అన్నదాతలు చెమట చిందిస్తేనే దేశం కడుపు నిండేదని.. రైతులకు ఏం చేశారో యూపీఏ సమాధానం చెప్పాలని మోడీ డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో ముందుకెళ్తున్న అన్నదాతలను గుజరాత్ సర్కారు గౌరవించిందని, వారిని రాష్ర్టానికి పిలిపించి మా విశ్వవిద్యాలయం పాఠాలు నేర్చుకుందని తెలిపారు. ఢిల్లీ సర్కారే ఆదర్శ రైతులను సన్మానించాలని భావించి విరమించుకుంటే గుజరాత్ లాంటి చిన్న రాష్ట్రం చేసి చూపించిందని పేర్కొన్నారు. ఇంత పెద్ద దేశం ఒక్కరి ఆలోచనలకు అనుగుణంగా నడవాలా? అని ప్రశ్నించారు. 120 కోట్ల మంది భారతీయుల ఆలోచనలు, ఆకాంక్షలతో భారతావని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.