రేపు పెద్దల సభకు తెలంగాణ బిల్లు

న్యూఢిల్లీ : ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు లైన్ క్లియరైంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయం సైతం ఈ విషయాన్ని ధృవీకరించినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఇవాళ ఉదయం కాంగ్రెస్ చీఫ్‌విప్ చతుర్వేది సైతం ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. టీ బిల్లుకు రాష్ట్రపతి ఓకే చెప్పారని, ముందుగా చెప్పినట్లు కాకుండా ఒక రోజే ముందే పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆయన తెలిపారు.

ఇదే విషయంపై రాజ్యసభ ఛైర్మన్ అన్సారీతో మంత్రులు కమల్‌నాథ్, షిండే, జైరాంరమేష్‌లు సమావేశం అయ్యారు. అలాగే రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీతో కూడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ భేటీ అయి బిల్లుకు సహకరించే విషయంపై చర్చించారు. 17 లేదా 18 తేదీల్లో తెలంగాణ బిల్లు లోకసభకు వచ్చే అవకాశాలున్నాయి.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.