రేణుక వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం: కోదండరాం

తెలంగాణ ఆత్మబలిదానాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి,రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని కింఛపరుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేణుక ఢిల్లీలో ఉంటూ సీమాంధ్రకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేణుకా చౌదరీపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ఇవాళ ఫిర్యాదు చేశామని కోదండరాం తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.