‘రేణుకా’ వ్యాఖ్యలకు నిరసనగా గన్‌పార్క్ వద్ద ధర్నా

హైదరాబాద్ : తెలంగాణ కోసం నిండు ప్రాణాలను బలిదానం చేసుకున్న అమరవీరులపై అనుచితంగా మాట్లాడిన రేణుకా చౌదరి చర్యలు తీసుకోవాలని గన్‌పార్కు వద్ద టీజేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న టీ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం మాట్లాడుతూ సీమాంధ్ర పెత్తందారి అహంతో మాట్లాడిన రేణుకా చౌదరితో కాంగ్రెస్ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. అధికార ప్రతినిధిగా మాట్లాడితే ఆమె పై చర్యలు తీసుకోవాలన్నారు. అమరవీరుల సూసైడ్ నోట్‌లు చూసి కూడా ఇలా మాట్లాడటం కుట్రే నన్నారు. కాంగ్రెస్ నేతలు రేణుకా వ్యాఖ్యలపై వెంటనే స్పందించాలని, ఆమెతో క్షమాపణ చెప్పించాలని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అహం మాటలు మాట్లాడిన రేణుకా చౌదరిపై కేసులు పెడ్తామని అడ్వకేట్ జేఏసీ హెచ్చరించింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.