హైదరాబాద్ : తెలంగాణ అమరవీరుల మరణం పై నోటికొచ్చినట్లు మాట్లాడిన రాజ్యసభ సభ్యురాలు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రెణుకా చౌదరి నాలుక కోస్తామని తెలంగాణ అమరవీరుల కుటుంబాలు హెచ్చరించాయి. ఇవాళ హైదరాబాద్లోని రేణుకాచౌదరి ఇంటి ఎదుట టీ అమరవీరుల కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. నోరు ఉన్నదని ఇష్టం వచ్చినట్లు మాట్లడితే తీవ్రపరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. అమరవీరులపై చేసిన మాటలు వెనక్కు తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రెణుకా చౌదరి ఎక్కడికి పోయిన అక్కడ చెప్పులతో, చీపుర్లతో తగిన శాస్తి చేసి, బుద్ది చెపుతామన్నారు