రేణుకాచౌదరి క్షమాపణ చెప్పాలి: శ్రీనివాస్‌గౌడ్

తెలంగాణ అమరవీరుల బలిదానాలను చులకన చేస్తూ మాట్లాడిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి బహిరంగ క్షమాపణ చెప్పాలని జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. లేకపోతే రేణుకకు తెలంగాణలో తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. రేణుక అహంకారపూరితంగా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.