రేణుకాచౌదరి ఇంటిని ముట్టడించిన టీఆర్‌ఎస్ మహిళా విభాగం, తెలంగాణ మహిళా సంఘాలు

 

sdfhyg

తెలంగాణ అమరవీరుల పట్ల కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్‌ఎస్ మహిళా విభాగం, తెలంగాణ మహిళా సంఘాల జేఏసీ నేతలు గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న మహిళలు.. రేణుకాచౌదరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె ఇంటిపైకి కోడిగుడ్లు, టమాటలు, చీపుర్లు విసిరి తీవ్ర నిరసన వెలిబుచ్చారు. ఇంట్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. తెలంగాణ మహిళా సంఘాల జేఏసీ కన్వీనర్ సంధ్య మాట్లాడుతూ రేణుకాచౌదరి వ్యాఖ్యలతో మహిళాజాతి మొత్తం ఆగ్రహంతో ఊగిపోతోందని, వెంటనే ఆమె అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పకపోతే మహిళలు ఆమెకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్షికమంలో టీఆర్‌ఎస్ మహిళావిభాగం అధ్యక్షురాలు తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. నిరసన వ్యక్తంచేసిన మహిళలను పోలీసులు అరెస్టుచేసి గోల్కొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.