రెవెన్యూ రాబడుల్లో తెలంగాణదేసింహభాగం

రాష్ట్రంలో అమలులో ఉన్న రూ. లక్షా 61కోట్ల వార్షిక బడ్జెట్‌లో కీలక ఆదాయమంతా తెలంగాణ ప్రాంతంనుంచే వస్తోంది. విభజన అనంతరం రాబడుల రూపురేఖలు మారిపోతాయి. ప్రాంతాలవారీగా ఆదాయ, వ్యయాల్లో మార్పులు అనివార్యం కావడం తథ్యం కానుంది.
బడ్జెట్‌కు మద్యం, వాణిజ్య పన్నులే కీలక ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఈ రెండింటి ద్వారానే రూ. 60వేల కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ రెండు ఆదాయ వనరుల్లోనూ తెలంగాణాదే కీలక భూమిక కావడం గమనార్హం. మరో కీలక ఆదాయ వనరైన స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ ఏడాది రూ. 6414 కోట్లు ఆదాయ లక్ష్యంగా ఉంది.

వాణిజ్య పన్నులు
రాష్ట్రంలో వాణిజ్య పన్నుల వసూలుకు 6 సర్కిళ్లు ఉన్నాయి. మొత్తం పన్ను వసూలులో 64 శాతం మేర హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల నుంచే జరుగుతోంది. గతేడాది వసూలైన మొత్తం రూ. 52,500 కోట్ల వాణిజ్య పన్నుల ఆదాయంలో తెలంగాణ ప్రాంతంనుంచి రూ. 38వేల కోట్లకు పైగా వసూలయ్యాయి. ఇందులో హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల వాటా 90 శాతానికి మించి ఉంది. రెండో స్థానంలో కోస్తాంధ్ర, చివరి స్థానంలో రాయలసీమ ఉంది.

స్టాంపులు-రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో 432 రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. ఇందులో అతి తక్కువ తెలంగాణలోనే ఉన్నప్పటికీ అత్యధిక ఆదాయం ఇక్కడే వస్తోంది. తెలంగాణ జిల్లాల్లో 141 సబ్ రిజిస్ట్రార కార్యాలయాలు పనిచేస్తుండగా ఖజానాకు మొత్తం రిజిస్ట్రేషన్ ఆదాయంలో 61 శాతంపైగా లభిస్తోంది. ఇందులో హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల నుంచే 40 శాతం ఆదాయం వస్తోంది. ఇక 291 రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్న సీమాంవూధనుంచి 39శాతం ఆదాయం లభిస్తోంది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల పరిపాలనా సౌలభ్యంలో భాగంగా 38 రిజిస్ట్రేషన్ జిల్లాలను ఏర్పాటు చేశారు. గతేడాది రూ. 4968 కోట్ల రెవెన్యూలో సుమారు 64 శాతం తెలంగాణనుంచే సాధ్యమయింది. డాక్యుమెంట్ల వారీగా చూసినా తెలంగాణలోని రంగాడ్డి, హైదరాబాద్‌లు లక్ష్యం అధిగమించి 67 శాతం అధికంగా ఆర్జించడం విశేషం. గతేడాది రంగాడ్డి 43.38 శాతం, ఆదిలాబాద్ 220 శాతం, హైదరాబాద్ 28 శాతం, హైదరాబాద్ సౌత్ మరో 26.53 శాతం, నల్గొండ 20.39, మెదక్ 14.50 శాతం అధిక వృద్దిని సాధించగా…కోస్తాంధ్ర, రాయలసీమల్లోని ఒక్క ప్రాంతంకూడా లక్ష్యాన్ని చేరుకోలేదు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.