రెచ్చగొడుతున్న సీమాంధ్ర ఉద్యోగులు

– ఘర్షణ సృష్టించి.. హైదరాబాద్‌లో రక్షణ లేదని చూపే కుట్ర
– సంయమనం పాటించాలి.. 22న మౌన ప్రదర్శన
– సచివాలయ తెలంగాణ ఉద్యోగ సంఘం పిలుపు
‘సీమాంధ్ర ఉద్యోగులు తమ మాటలు, చేతలతో తెలంగాణ వారిని రెచ్చగొట్టి.. కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఘర్షణ సృష్టించి.. హైదరాబాద్‌లో రక్షణ లేదని చూపాలని విశ్వవూపయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణవాదులు ఈ కుట్రలో పడకుండా సంయమనంతో వ్యవహరించాలి’ అని సచివాలయ తెలంగాణ ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి మాధవరం నరేందర్‌రావు విజ్ఞప్తి చేశారు. సోమవారం సచివాలయంలోని కే బ్లాక్‌లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో నరేందర్‌రావు మట్లాడుతూ.. సమైక్యం పేరిట చేస్తున్న అనైతిక ఆందోళనను ఖండించారు. సమావేశంలో సంఘం చైర్మన్ ఎన్ శంకర్, సలహాదారు సుభద్ర, వెంక పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించాలని.. సచివాలయంలో శాంతిసామరస్యాలు కోరుతూ 22న (గురువారం) కే బ్లాక్‌నుంచి సీ బ్లాక్ వరకు మౌన ప్రదర్శన నిర్వహించాలని తీర్మానం చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.