రూపాయి బలోపేతానికి చర్యలు: చిదంబరం

న్యూఢిల్లీ: రూపాయి విలువ నాన్‌స్టాప్‌గా పడిపోతూనే ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈమేరకు రూపాయిని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రకటించారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉందని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై పౌరులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రూపాయి బలోపేతంతోనే అన్ని సమస్యలు అధిగమించాలని తెలిపారు. మార్కెట్లను త్వరలో స్థిరీకరిస్తామని తెలిపారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.