రిసార్ట్ దందా!

-పర్యాటకం పేరిట దగా.. కోట్లాది రూపాయల వ్యాపారం
– పైసా పన్నూ చెల్లించని వైనం
– పర్యాటకాభివృద్ధి పేరిట బురిడీ
– హైదరాబాద్ శివార్లలో వందకుపైగా రిసార్టులు
– మంత్రులు, రాజకీయ నాయకులకూ వాటాలు
– ఉద్యోగం, డబ్బుల పేరిట రైతాంగం నోట మట్టి
– దృష్టి సారించిన విజిపూన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్
– ఓ రిసార్ట్ తనిఖీల్లో దిమ్మతిరిగే వాస్తవాలు వెల్లడి
– ఏటా రూ. 200 కోట్లకు ఎగనామం
Leonia-restarentపర్యాటకాభివృద్ధి పేరిట హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టిన రిసార్టుల్లో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పచ్చని పంట పొలాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. అందులో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన రిసార్టులు పక్కా వ్యాపారానికి తెరతీసినట్టు తెలుస్తోంది. ఇవి పాశ్చాత్య సంస్కృతిని దిగుమతి చేసుకుంటూ.. అక్రమ కార్యకలాపాలకు వేదికగా మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌తో సహా నగరం చుట్టూ ఉన్న రంగాడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో వెలిసిన రిసార్టులు.. కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తూ.. ప్రభుత్వానికి పైసా పన్ను చెల్లించడం లేదని విషయం ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో వెలుగుచూసింది.

పర్యాటకాభివృద్ధి చేస్తున్నామని చెప్పి.. పన్ను మినహాయింపు ఉందని బుకాయిస్తూ.. అవి రాష్ట్ర ఖజానాను బురిడీ కొట్టిస్తున్నాయని తేలింది. పేరుకు రిసార్టులే అయినా.. అందులో మసాజ్ సెంటర్లు, స్పా కేంద్రాలు, రెస్టాంట్లు, ఫంక్షన్‌హాళ్లు, బార్లు, హోటళ్లు, లాడ్జీలు, నైట్‌లైఫ్‌లతో పూర్తిస్థాయిలో దందా సాగిస్తున్నాయని, రిసార్టులో ఒక్క రాత్రికి కేవలం రూ. ఐదు వేల నుంచి పది వేల దాకా వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈ రిసార్టుల్లో అత్యధికం సీమాంధ్ర వారివే ఉన్నట్టు సమాచారం. వీటిల్లో మంత్రులు, ఎంపీలకూ వాటాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రిసార్టుల్లో ఇటీవల రాష్ట్ర విజిపూన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్టుమెంటు అధికారులు తనిఖీలు జరిపారు. ఇందులో వాటి వ్యాపారం లెక్కలు అధికారులే ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. చాలా రిసార్టులు సర్కారుకు పైసా పన్ను కట్టకుండా జల్సా చేస్తున్న విషయం బహిర్గతమైంది. పైగా పర్యాటక రంగం అంటూ మినహాయింపు పేరిట కాకి లెక్కలు చూపిస్తూ యథేచ్ఛగా దోచుకుంటున్నట్టు తేలింది.

నగరం చుట్టూ రీసార్టులే..
హైదరాబాద్ నగరం చుట్టూ రంగాడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో వంద వరకు రిసార్టులు దర్శనమిస్తున్నాయి. ఒక్కొక్కటి 30 ఎకరాల నుంచి 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇవి పైసా పన్నులేవీ సర్కారుకు చెల్లించకుండా రూ.వందల కోట్లు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిసార్టుల బండారం బయటపె రంగంలోకి దిగిన విజిపూన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులపై కూడా రాజకీయ ఒత్తిళ్లు వచ్చినట్టు సమాచార. అగ్గువ ధరకు భూములు కొట్టేసి ఏర్పాటు చేసుకున్న రిసార్టుల్లో అసాంఘిక కార్యకలాపాలను కూడా సాగిస్తున్నారని, నగర శివార్లలో విస్తరిస్తున్న పబ్ సంస్కృతికి ఇవే వేదికలుగా మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తనిఖీలో వెల్లడి
ఇటీవల రంగాడ్డి జిల్లా షామీర్‌పేట మండలం బొమ్మరాజుపేటలోని లియో మెరిడియన్ రిసార్టును రాష్ట్ర విజిపూన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు తనిఖీ చేశారు. ఇందులో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రిసార్టులో మూడు థియేటర్లు, 5 రెస్టాంట్లు, హెల్త్ స్పా, కాన్ఫన్స్ హాల్, రీక్రియేషన్ క్లబ్ వంటి అనేకం కనిపించాయి. 2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాల్లో అధికారికంగా చూపించిన లెక్కల ప్రకారమే సుమారు రూ.190 కోట్ల వ్యాపారం సాగింది. ఇదంతా ప్రాథమిక అంచనా ప్రకారమే. ఇక్కడున్న రిసార్టులో ఒక్కో గదికి రోజుకు రూ.4 వేల నుంచి రూ.12 వేల వరకు కిరాయి తీసుకుంటున్నారు. మొత్తంగా ఇది ఐదు నక్షవూతాల హోటల్‌ను తలపించింది. అయితే దీనినుంచి సర్కారుకు పన్నుల కింద పైసా కూడా రాలేదు.

విజిపూన్స్ అధికారులు ప్రాథమికంగా లెక్క కడితే 2010-11లో రూ.126.43 కోట్ల వ్యాపారం జరుగగా, రూ.6.31 కోట్లు, 2011-12లో రూ.60.90 కోట్లకుగాను రూ.3.04 కోట్లు పన్ను కట్టాల్సిందిగా తేలింది. అంటే ఒకటిన్నర ఏళ్లుగాను ఈ రిసార్ట్ రూ.9.36 కోట్ల పన్నును ఎగవేసిందని స్పష్టమవుతోంది. అలాగే తాజాగా లెక్క కట్టిన విజిపూన్స్ అధికారులు వ్యాట్ చట్టం కింద ఈ రెండేండ్లకు గాను రూ.20.33 కోట్లు, ఏపీ ఎంటర్‌టైన్‌మెంట్ చట్టం కింద నాలుగేండ్లకుగాను రూ.2.40 కోట్లు చెల్లించాలని తేల్చారు. రూ.34.93 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలని అధికారులు తాఖీదులిచ్చారు. అయితే తమకు పర్యాటక అభివృద్ధి కింద పన్ను మినహాయింపు ఉందంటూ యాజమాన్యం బదులిచ్చింది.

వ్యాపారం సాగిస్తోన్న రిసార్టుకు పన్ను మినహాయిపు ఎలా ఉంటుందంటూ సదరు అధికారులే తల్లడంమల్లడమయ్యారు. ఆఖరికి వారు యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక శాఖ జారీ చేసిన జీవో నెం.10(తేదీ.25-02-2009)ని చూపించారు. ఇందులో రూ.500 కోట్లతో రూపొందించిన రిసార్టులో మరో రూ.1500 కోట్లతో అభివృద్ధి చేయడం, స్థానిక వనరులను తీసుకోవడం, అక్కడి వనరులను అభివృద్ధి చేయడం, ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి అనేక నిబంధనలు ఉన్నాయి. జీవోను నిశితంగా పరిశీలించిన అధికారులకు అందులో పన్ను మినహాయింపు ప్రస్తావన లేనట్టు గుర్తించారు. ఈ రిసార్టులో 466 గదులు, మూడు థియేటర్లు, రిక్రియేషన్ క్లబ్బు కూడా ఉన్నాయి. ఐతే వీటికి అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు. దీనిపై లోతుగా పరిశీలించాల్సి ఉందని విజిపూన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. పైగా పన్నుల రూపంలో జరిగిన వ్యాపారంలో కనీసం ఐదు శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

సెంట్రల్ ఎక్సైజ్ శాఖ తనిఖీలోనూ..
ఇదే రిసార్టుపై సెంట్రల్ ఎక్సైజ్ శాఖ దాడి చేసింది. దాని ప్రకారం 2008-09లో వ్యాపారం 137.98 కోట్లు జరిగితే రూ.118.67 కోట్లుగా, 2009-10లో రూ.124.93 కోట్లకు గాను రూ.119.30 కోట్లుగా తప్పుడు లెక్కలు చూపించినట్లు ఆ శాఖ అధికారులు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇలా ఆదాయపు పన్ను శాఖను బురిడీ కొట్టించినట్లు ఓ ఉన్నతాధికారి వివరాలు చెప్పారు.

ఏం జరుగుతుందంటే…
నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతోపాటు స్థానికులకు ఉపాధి కల్పించాల్సి ఉంది. కానీ సీమాంధ్ర పెత్తందార్లు ఏర్పాటు చేసుకున్న రిసార్టుల్లో స్థానికులకు ఉపాధి కల్పించిన దాఖలాలు లేవు. స్థానిక వనరులను వినియోగించుకుంటున్నప్పుడు అక్కడి అవసరాలు తీరుస్తూ అభివృద్ధికి దోహదపడాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ వారి వ్యవహారం లాభార్జనే థ్యేయంగా నడుస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గదుల కిరాయి, రెస్టాంట్ల బిల్లులు, పబ్, బాడీ స్క్రబ్, ఫేషియల్, సెలూన్, ఫిష్ స్పా, మెడి వంటి అనేక సదుపాయాలకు వ్యాట్ కింద అదనంగా 5 నుంచి 10 శాతం వరకు పన్నులు విధిస్తున్నారు. ఒక్క కుటుంబం రిసార్టులో ఒక్క రోజు గడిపితే అయ్యే ఖర్చు రూ.10 వేలకు పైమాటే. ఇంతగా వ్యాపారం చేస్తున్న రిసార్టుల యజమానులు.. టూరిజం పాలసీ కింద తమకు పన్ను మినహాయింపు వర్తిస్తుందంటూ బుకాయిస్తున్నారు.

మినహాయింపు ప్రభుత్వమే ఇచ్చిందంటూ దొంగ జీవోలను చూపిస్తున్నారు. పాలనపరమైన వ్యవస్థీకృత విధానాల ప్రకారం ఈ మినహాయింపు జీవోలు రెవెన్యూ శాఖ జారీ చేయాల్సి ఉంది. కానీ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామంటూ పొందిన అనుమతులను కుంటిసాకుగా చూపిస్తూ.. పన్ను ఎగవేతకు పాల్పడటంవిడ్డూరంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. ప్రైవేటు రిసార్టుల పేరిట వ్యాపారం చేస్తూ పర్యాటకాభివృద్ధి చేస్తున్నామనడం అర్థరహితమని అధికారులంటున్నారు. నిబంధనల ప్రకారం పక్కాగా పన్నులు చెల్లిస్తోన్న రిసార్టు రాష్ట్రంలో ఒకటీ రెండు మాత్రమే ఉన్నాయని సమాచారం. వారు కూడా మిగతా యాజమాన్యాలు చెల్లించనప్పుడు తామెందుకు కట్టాలంటూ అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

This entry was posted in ARTICLES.

Comments are closed.