రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ హైదరబాద్..సిన్మావాలా ముర్ఖాబాద్

cinemareel-రాజకీయాలకూ ఒకప్పుడు పరిక్షిశమ దూరం
-ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో సీన్ చేంజ్
-రాజధానిలో సీమాంధ్ర దందాకు ‘క్లాప్’
-తెలంగాణ గడ్డపై సినీజనావాసాలు.. యథేచ్ఛగా భూ పందేరాలు
-రీళ్ల నుంచి రియల్‌ఎస్టేట్‌ల దాకా.. ఇతర రంగాల్లోకి మిగులు సంపద
-80ల వరకూ రెడ్డి రాజకీయాలే
-దశాబ్దాలపాటు ఏలిన కాంగ్రెస్
-తెలుగువారికి తీవ్ర అవమానాలు
-వాటిపై సమరభేరీ మోగించిన ఎన్టీఆర్
-ఒక సామాజికవర్గం విశేష మద్దతు
-పార్టీ పెట్టిన నెలలకే అధికారంలోకి
-కోస్తా సినీ పెద్దలకు కలిసొచ్చిన కాలం
-హైదరాబాద్‌ను రాసిచ్చేసిన మామా అల్లుళ్లు

సినిమా…! 80వ దశకంలో కొత్త ఊడలు దిగింది! రాజకీయం అనే మరో రంగంతో చెట్టపట్టాలేసి.. చెలిమి చేసింది! ఒకరిద్దరు మినహాయిస్తే అప్పటిదాకా జెండాలకు దూరంగా ఉన్న సినీ ప్రముఖులు.. హైదరాబాద్‌లో పరిక్షిశమ సుస్థిరస్థానం ఏర్పాటు చేసుకున్నాక..రాష్ట్ర రాజకీయాలపైనా దృష్టిసారించారు! కోస్తా మిగులు ధనం కొత్త రాగం తీసింది! రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ హైదరబాద్.. సిన్మావాలా జిందాబాద్! వడ్డించే వాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా నష్టం లేదు.. బ్లడీ ఓల్డ్ సామెత! మనోడే కదా.. మొదటి బంతిలోనే స్వాహా చేసేద్దాం.. అనేది తాజా తాపవూతయం! ఊటీని తలపించే కొండలు.. గుట్టలు.. ప్రశాంతమైన వాతావరణం! అద్భుతమైన వెలుగు! ఇది సెవెంటీ ఎంఎం సినిమా తెర! పంచుకున్నోడికి పెంచుకున్నంత! పెంచుకునే పంపకాలకు నాందీప్రస్తావన పలికింది నందమూరి తారక రామారావు! సినిమా రంగాన్ని, రాజకీయాలను మిళితం చేసి.. రాజకీయాధికారం కలిగిన కొత్త పెట్టుబడిదారీవర్గానికి ప్రాణం పోసిన నట దర్శక నిర్మాత! ఎన్టీఆర్ రాకతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ రాజకీయ ఎజెండా ఎలా ఉన్నా.. అప్పటికే హైదరాబాద్‌లో నిలదొక్కుకుంటున్న తెలుగు సినీ పరిక్షిశమలోని కోస్తా పెట్టుబడి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని.. ఆర్థిక సామ్రాజ్యపు అదనపు కోరలు సాచింది ఈ కాలంలోనే! కోస్తాంధ్ర ప్రాంత ప్రజలు, సరుకులు, సంస్కృతి రాష్ట్ర రాజధానికి ప్రయాణం కట్టింది ఈ సమయంలోనే! రీల్ టు రియల్టీ! రండి బాబూ.. రండి.. ఆంధ్రా భోజనం.. తయార్! సంక్రాంతికి ఖాళీ అయ్యే రాజధాని నగరమే సాక్షి!!

political-actors(టీ మీడియా బృందం):రాజకీయం వేరు.. సినిమా వేరు! ఇది ఒకప్పటి మాట! ఎత్తుపల్లాలు ఎన్ని ఉన్నా.. సినిమా అనేది ప్రధానంగా ప్రజా వినోదానికి, తద్వారా నలభై రాళ్లు వెనకేసుకోవడానికి మాత్రమే అప్పట్లో పరిమితమైంది. ప్రజానాట్యమండలి నుంచి వచ్చిన వారిలో దర్శకులుగా, నిర్మాతలుగా మారినవారు వామపక్ష భావజాలాన్ని ప్రకటించుకున్నారు తప్పించి.. సినిమా రంగం అంటూ రాజకీయంతో చెట్టపట్టాలేసిన సందర్భాల్లేవనే చెప్పాలి. 80వ దశకంలో ఈ పరిస్థితి మారిపోయింది. కోస్తా మిగులు సంపదతో సినిమా రీళ్లు చుట్టిన ఒక సామాజిక వర్గం.. ఆ సంపదను మరింత పెంచుకునేందుకు రాజకీయ అధికారం వైపు దృష్టి సారించింది. మెల్లమెల్లగా రాజకీయాల్లోకి ప్రవేశించింది. సీన్ మార్చేసింది! ఇప్పుడు రాజకీయాలే సినిమాలుగా మారిపోయాయి.. సినిమా రంగంపై రాజకీయాలు ముసురుకున్నాయి! ప్రజలతో నిత్య సంబంధాలు ఉండే ఈ రెండు రంగాలు ఇప్పుడు పాలు నీళ్లలా విడదీయలేనంతగా కలిసిపోయాయి! దీనికి మూలపురుషుడు నందమూరి తారక రామారావే అనటంలో సందేహం లేదు.

ఆ తర్వాత కొంత కాలం నటుడు కృష్ణ కాంగ్రెస్ తరఫున ఎంపీ అయ్యారు. కృష్ణంరాజు వంటివారు బీజేపీలో పని చేశారు. దాసరి నారాయణరావు కేంద్ర మంత్రి అయ్యారు.తాజాగా చిరంజీవి తొలుత ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి.. దానిని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ వంటివారు సైతం రాజకీయాల్లోకి వచ్చారు. మోహన్‌బాబు తెలుగుదేశం తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. విజయశాంతి మెదక్ నుంచి ప్రస్తుతం టీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్నారు. రోజా గతంలో టీడీపీలో ఉండి.. ఇప్పుడు వైఎస్సార్‌కాంక్షిగెస్ గూటికి చేరారు.

1980వ దశకంనాటికి (1978 ఎన్నికల్లో తిరిగి విజయం సాధించడం ద్వారా) కాంగ్రెస్ అధికారంలో ఉంది. అంతర్గత కుమ్ములాటలు.. పార్టీలో ముఠా సంస్కృతి కారణంగా కాంగ్రెస్‌పై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వెల్లు 1978 తర్వాత ఐదేళ్లలో నలుగురు ముఖ్యమంవూతులు మారారంటే రాజకీయ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దల నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యేవి. తెలుగు ఆత్మగౌరవం తాకట్టుకు గురైంది. రాష్ట్రానికి సీఎం ఎవరో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించేవారు.. ఆ నిర్ణయానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆమోద ముద్ర వేసేవారు! ఇవన్నీ జనంలో అసంతృప్తిని రాజేశాయి. ఆ వ్యతిరేకతను ఒక వేదికపైకి తీసుకురాగల సత్తా అప్పటికి ఏ పార్టీకీ లేదు. సీపీఎం, సీపీఐ ప్రజాపక్షపాతులుగా ఉన్నప్పటికీ.. రాష్ట్రం మొత్తంగా రాజకీయాన్ని ప్రభావితం చేసే స్థితిలో లేవు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేని పరిస్థితి.

ఆ సమయంలో ఆ ఖాళీని ఎన్టీఆర్ భర్తీ చేశారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పిలుస్తోంది.. రా.. కదిలిరా! అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపునకు, తెలుగువాడి ఆత్మగౌరవం నినాదానికి విశేష మద్దతు లభించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 75వేల కిలోమీటర్లు ప్రయాణించారు. తదుపరి 9 నెలలకు 1983 ఆగస్ట్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి.. కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టారు. రాష్ట్రంలోని 294 స్థానాలకు గాను తెలుగుదేశం 199 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. ఇదొక చారివూతక సందర్భం.

ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం సంకేతాలు అంతకు ఒకటి రెండు సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయి. సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, నాదేశం వంటి సినిమాలు.. ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి సంకేతాలుగా నిలిచాయి. 1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టతనిచ్చారని చెబుతుంటారు. అప్పటికి అరవైయ్యవపడికి సమీపంలో ఎన్టీఆర్ ఉన్నారు. ఆ సమయంలో ఒక విలేకరి ఎన్టీఆర్‌ను భవిష్యత్ కార్యక్షికమంపై ప్రశ్నించగా.. తన తదుపరి పుట్టిన రోజు నుంచి నెలకు పదిహేను రోజులు ప్రజాసేవకు కేటాయిస్తానని చెప్పారని, అదే ఆయన రాజకీయ ప్రయాణానికి మొదటి సంకేతమని భావిస్తుంటారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ తాను నటించాల్సిన సినిమాలను వేగంగా పూర్తి చేశారు. 1982మార్చి29 మధ్యాహ్నం 2.30 గంటలకు టీడీపీ స్థాపన ప్రకటన చేశారు. తన పాత వ్యానును బాగు చేయించి, దానికి చైతన్యరథంగా నామకరణం చేసి.. రాష్ట్రంలో విస్తృతంగా ప్రయాణించారు. భారతదేశ రాజకీయ రంగంలో రథ యాత్రలకు ఎన్టీఆర్ చైతన్యరథమే స్ఫూర్తి అనడంలో సందేహం లేదు.

ఎన్టీఆర్‌కు పూర్వం కొంగర జగ్గయ్య కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ప్రభాకర్‌డ్డి వామపక్ష భావజాలం కలిగి ఉండేవారు. మాదాల రంగారావు, టీ కృష్ణ వంటివారు విప్లవ భావాలను వినిపిస్తుండేవారు. వీరెవ్వరూ ఆర్థిక ప్రయోజనాలు చూసుకున్న దాఖలాలు లేవు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే సినిమా రంగంపై రాజకీయ ముద్ర మరింత స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌పై కోస్తా దృష్టి కేంద్రీకృతమైంది. వ్యవసాయం, సినిమా రంగంలో మిగులు సంపద హైదరాబాద్ బయల్దేరింది. కోస్తా జిల్లాల నుంచి హైదరాబాద్‌కు సరుకు రవాణా, మనుషుల రాకపోకలు పెరిగాయి.

రాజకీయ ‘కుల’ ఆధిపత్యం ఆధారంగా సినీ పరిక్షిశమ పెద్దలు హైదరాబాద్‌లో తిష్ఠవేశారు. కోస్తా నుంచి హైదరాబాద్‌కు వలసలు కూడా ఈ కాలంలోనే విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్‌లో ‘ఆంధ్రా భో జనం’ తయారైంది. ఇడ్లీ బండ్లు సహా అనేకానేక వ్యాపారాల్లో కోస్తావనరులు దిగుమతయ్యాయి. ఇప్పుడు నగరంలోని ప్రధాన ఆవాస ప్రాంతాల్లో కోస్తా, రాయలసీమవారే ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. వనస్థలిపురం.. దిల్‌సుఖ్‌నగర్ కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు వంటివి నగరంలో మరో కోస్తా ప్రాంతాలు అన్నట్లు తయారయ్యాయి. ఇవికాక వివిధ ప్రాంతాల్లో అనుబంధ టౌన్‌షిప్‌లు, భారీ గేటెడ్ కమ్యూనిటీల్లో కోస్తా ప్రజానీకమే కనిపిస్తుంటుంది. నగరంలో ఎంత మంది కోస్తాంధ్ర వాసులు ఉంటారో లెక్కతీయాలంటే సంక్రాంతి సముచితమైన సందర్భం కాగలదు. సంక్రాంతి సెలవు రోజుల్లో నగరం ప్రశాంతంగా కనిపిస్తుంటుంది. నగర రోడ్లు ట్రాఫిక్ నరకానికి దూరంగా ఉంటాయి! అస్లీ హైదరాబాద్! కోస్తాంవూధులు లేని పక్కా తెలంగాణ నగరం!

ఎన్టీఆర్ హయాంలో నగర ప్రవేశం చేసిన కోస్తా పెట్టుబడులు ఇతర రంగాలపైకి దృష్టిసారించాయి. కాలేజీలు, ఆస్పవూతులు, పరిక్షిశమలు, ఫార్మా ఇండస్ట్రీ ఇలా అనేక రంగాల్లోకి పొంగిపొర్లాయి. అదే సమయంలో ఇక్కడ అప్పటికే ఉన్న అనేకానేక పరిక్షిశమలు మూతపడ్డాయి. ప్రఖ్యాత ఆస్పవూతులు.. నిర్వీర్యమైపోయాయి. ఐడీపీఎల్ వంటి ఆసియా ప్రముఖ ఔషధ కంపెనీ నాశనమైంది. ఆ కంపెనీలో ఉద్యోగులుగా పని చేసినవారు.. దాని సాంకేతిక, శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సొంతగా మెడికల్ ల్యాబ్‌లు పెట్టుకుని కోట్లు దండుకున్నారు. హైదరాబాద్ ఆల్విన్ మటుమాయం అయింది. రిపబ్లిక్‌ఫోర్జ్.. సహా అనేక కంపెనీలు అదృశ్యమయ్యాయి. అప్పటికే తెలంగాణ పల్లెల్లో ఉన్న గులాబీ తోటలు, అంగూర్ తోటలు, కూరగాయల పంటలు సమాధి అయ్యాయి. వాటిపై రంగాడ్డి, మెదక్ జిల్లాలతో పాటు..నల్లగొండ జిల్లాల్లోని కొంత భాగంలో (హైదరాబాద్ శివారు) ఫాంహౌస్‌లు. ఎస్టేట్‌లు మొలిచాయి.

రాజకీయాలు ఆసరాగా సినిమా స్టూడియోల పేరుతో భూములు పొందడం మరింత పెరిగింది. సినిమాల ద్వారా వచ్చిన సొమ్ముతో (ఇందులోనూ వసూళ్ల రిత్యా నైజాం షేరే అత్యధికం) తెలంగాణ భూములను అడ్డికి పావుశేరు లెక్కన భారీ ఎత్తున కొనుగోళ్లు చేశారు. తెలంగాణ సొమ్ముతోనే తెలంగాణ భూములను కొని.. ప్రాంతీయులను పరాయివాళ్లను చేశారు. ఇక్కడ అభివృద్ధి చేసిన స్టూడియోలు, ఫాంహౌస్‌లు, ఎస్టేట్‌లలో పనివారిని కూడా కోస్తా నుంచి తెచ్చి నింపుకొన్నారు. ప్రభుత్వం కేటాయించిన భూములు కొన్ని.. తాము కొనుగోలు చేసినవి మరికొన్ని. హైదరాబాద్ ఖరీదైన భూములను తెలుగు సినీపెద్దలు స్వాధీనం చేసుకున్నారు.

వృద్ధాక్షిశమం పేరుతో నిర్మాత రామానాయుడు నగర శివారు ప్రాంతమైన నర్సాపూర్ పరిధిలో దాదాపు వంద ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి పొందారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణ అంటూ ఖరీదైన జూబ్లీహిల్స్‌లో చిరంజీవి స్థలం కేటాయింపచేసుకున్నారు. తెలంగాణలో పేదవాళ్లు నిలువ నీడ కోసం 70 గజాల భూమిలో గుడిసెలు వేసుకుంటే కూల్చివేసే సర్కారు.. వీరికి మాత్రం కోరుకున్న చోట్ల వందల ఎకరాలు కారుచౌకగా కట్టబెట్టింది. వాటిని తోచినంత ఎక్కువకు అమ్ముకోవడానికి, ఆ భూముల్లో ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు మంజూరు చేసింది. పత్రికాధిపతిగా ఉంటూ సినీ రంగంలోకి వచ్చిన రామోజీరావు ఫిలింసిటీ పేరుతో నాలుగువేల ఎకరాలను వశం చేసుకున్నారు. ఎన్టీఆర్ కుటుంబం, చిరంజీవి, దాసరి నారాయణరావు, అక్కినేని కుటుంబం ఇలా అనేక మంది ఇదే దారిలో హైదరాబాద్ భూములపై వాలారు. ఔటర్‌రింగ్ రోడ్డును ఆనుకొని మొయినాబాద్ వరకు దాదాపుగా భూములన్నీ సినిమా పెద్దల భూ దాహానికి బలయ్యాయని ఆ ప్రాంత రైతు యాదయ్య వాపోయారు. తెలంగాణ భూముల సంరక్షణ చట్టం వీరికి చుట్టమైంది.

తెలంగాణ భూములను బయటి వారు కొనకూడదు.. కొనాలన్నా తెలంగాణ ప్రాంతీయ బోర్డు అనుమతి తీసుకోవాలి. కానీ హైదరాబాద్ భూములపై కన్నేసిన సీమాంధ్ర రాబందులు తమ రాజకీయ పలుకుబడితో అసలు తెలంగాణ బోర్డునే లేకుండా చేశారు. బోర్డే లేనప్పుడు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదన్న తీరుగా వ్యవహరించారు. ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, అసైన్డ్ భూములు ఇవేవి వీరి ముందు నిలవలేదు. పరిక్షిశమ తరలివచ్చే సమయానికే నగరంలో కీలకమైన ప్రాంతాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ స్థిరాస్తులు ఏర్పాటు చేసుకున్నారు. సినీ పెద్దల రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి నటుడు మురళీమోహన్‌ను ఆద్యుడిగా పేర్కొంటుంటారు. భూముల దందాలో జయభేరి మోగించారు. ఎన్టీఆర్, ఆయన అల్లుడు చంద్రబాబు సీఎంలుగా ఉన్న రాజకీయ అధికారం అడ్డుపెట్టుకుని వందల ఎకరాలను గుప్పిటపట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఎన్టీఆర్ మనుమడు జూనియర్ ఎన్టీఆర్‌కు పిల్లనిచ్చిన నార్నే శ్రీనివాసరావు చేతిలో దాదాపు వేయి ఎకరాల భూమి ఉందన్న ప్రచారం ఉంది. చిరంజీవి, అల్లు అరవింద్, దాసరి, మోహన్‌బాబులకు జూబ్లీహిల్స్‌తో పాటు మొయినాబాద్ మండలంలో వందల ఎకరాల్లో ఫాంహౌస్‌లు ఉన్నాయని చెబుతుంటారు. ఇలా తెలంగాణకు చెందిన వందల ఎకరాల భూములు సినిమా పరిక్షిశమలోని అగ్రజుల ఆధీనంలోకి రావడం వెనుక.. రాజకీయ ఆధిపత్యమే కారణమన్న వాదన ఉంది.

తెరపై రాజకీయ విలన్లు
తెర వెనుకే కాదు.. సినిమాల్లోనూ రాజకీయం ప్రధాన పాత్రనే పోషించింది. అనేక సినిమాలు రాజకీయ ఇతివృత్తాలతో వచ్చాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావటానికి ముందు కాలంలో రాజకీయ నాయకుల పాత్రలన్నీ ఖద్దరు ధరించి కనిపించేవి. ఇప్పటికీ అదే ధోరణి ఉన్నా.. అప్పట్లో ఖద్దరు ధరించే నాయకులున్న పార్టీని ప్రేక్షకులు సులభంగానే గుర్తించగలిగారు. ప్రజానాయకుడు అనే సినిమాలో నాగభూషణం ఒక డైలాగ్ చెబుతూ.. ప్రాణవాయువు లేకపోయినా బతకొచ్చు. కట్టుకున్న పెళ్లాం పక్కింటోడితో లేచిపోయినా బతుకొచ్చు.. కానీ.. పదవిలేకపోతే ఎలా? అంటాడు! కుళ్లిపోయి కంపుకొడుతున్న వికృత రాజకీయాలపై కలం వేసిన బాణంగా ఈ డైలాగ్ నిలిచిపోయింది. ముత్యాల ముగ్గు సినిమాతో లిటిగేషన్ రాజకీయాలకు సంధాన కర్తగా రావు గోపాలరావు వేసిన క్యారెక్టర్.. అప్పటి సామాజిక ధోరణులకు ప్రస్తావనే! ఈ సినిమా తదుపరి అనేక సినిమాల్లో రాజకీయ నాయకుడి వేషాలు వేశారాయన. కైకాల సత్యనారాయణ, ప్రభాకర్‌డ్డి, కోట శ్రీనివాసరావు, నూతన్‌వూపసాద్, బ్రహ్మానందం, పుండరీకాక్షయ్య, పరుచూరి గోపాలకృష్ణ, నర్రా వెంక చలపతిరావు, ఆహుతి ప్రసాద్, అంకుశం రామిడ్డి, రాళ్లపల్లి వంటివారు రాజకీయపావూతల్లో విలనిజాన్ని కురిపించారు.

తాజాగా ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండేలాంటివాళ్లు కూడా పొలిటికల్ విలనిజాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో తెలుగు సినిమాల్లో రాజకీయ విలన్లను గమనిస్తే ఒక రాజకీయ పార్టీని గుర్తుకు తెచ్చే విధంగా పాత్రల చిత్రీకరణ, ఆహార్యం ఉండేది. కల్తీ సారా వ్యాపారాలు, భూమి పంచాయితీలు, రాజకీయ భూస్వాములుగా అకృత్యాలతో పాత్రలు సాగేవి. పోలీసు వ్యవస్థతో కుమ్మక్కవడం వంటి నేటికీ రాజకీయ నాయకుల సహజశైలిగా ఉన్న వ్యవహారాలు సినిమాల్లో బాగానే పండాయి. ఇవన్నీ అప్పటి రాజకీయ పరిస్థితులకు అద్దంపడతాయి.

This entry was posted in ARTICLES.

Comments are closed.