రిపబ్లిక్ డే డెత్ లైన్ డే

Tjac
– 2013 తెలంగాణ సాధన సంవత్సరం
– జనవరి నెల మొత్తం కీలకం
– కాంగ్రెస్, యూపీఏలను నిద్రపోనీయొద్దు
– తెలంగాణ ప్రక్రియకు రోడ్‌మ్యాప్ ప్రకటించాలి
– అందరూ కేంద్రంపై ఒత్తిడిని కొనసాగించాలి
– ఆ మూడు పార్టీలు స్పష్టతనివ్వలేదు
– రాష్ట్రంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలతోనూ భేటీ
– హైదరాబాద్‌లో భారీ సభ.. ఢిల్లీలో మహాధర్నా
– టీఆర్‌ఎస్ కార్యాచరణకు సంపూర్ణ మద్దతు
– టీజేఏసీ చైర్మన్ కోదండరాం వెల్లడి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రిపబ్లిక్ డే (జనవరి 26) డెడ్‌లైన్‌గా టీజేఏసీ ప్రకటించింది. ఈలోపు తెలంగాణ ఏర్పాటుకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 2013 తెలంగాణ సాధన సంవత్సరంగా మిగలాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆకాంక్షించారు. సోమవారం టీఎన్జీవో కేంద్ర కమిటీ కార్యాలయంలో జరిగిన టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించి, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగించేందుకు ఎవరికి వారుగా, ఎక్కడికక్కడ వినూత్న రూపాల్లో నిరసన కార్యక్షికమాలు, ధర్నాలు, ర్యాలీలను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. జనవరి నెల తెలంగాణవాదులకు అత్యంత కీలకమని కోదండరాం అభివూపాయపడ్డారు. ‘కాంక్షిగెస్ పార్టీని, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని నిద్రపోనీయొద్దు, మనం కూడా నిద్రపోవద్దు’ అని అన్నారు. తెలంగాణ ఇస్తారా? చస్తారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ‘వాళ్లిచ్చేదేముంది? పోరాడి తెలంగాణ ప్రకటనను తెచ్చుకుంటాం’ అని ధీమా వ్యక్తం చేశారు. నెలలో తెలంగాణపై తేల్చుతామని కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా గడువు పెట్టుకుందని, అందులో భాగంగా కేంద్రంపై ఒత్తిడిని పెంచే కార్యక్షికమాలను విస్తృతంగా కొనసాగించాలని ఆయన కోరారు. అఖిలపక్ష సమావేశంలో పెద్దగా సమైక్యరాగం రాలేదని, ఈ సమయంలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ స్పష్టతను ఇచ్చి ఉంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తక్షణం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేదని ఆయన పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తప్పించుకునే ధోరణి ప్రదర్శించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జగన్ పార్టీ గోడ మీద పిల్లి పాత్రను పోషించిందని, అటు, ఇటు కాకుండా వ్యవహరించిందని ఆరోపించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిలో స్పష్టత లేకుండా పోయిందని కోదండరాం విమర్శించారు. 2008లో రాసిన లేఖపై కట్టుబడి ఉన్నట్లుగా కానీ, తెలంగాణకు అనుకూలమని కానీ ఆ లేఖలో ఎక్కడా లేదన్నారు. కనీసం ఆ లేఖను వెనక్కి తీసుకోలేదని కూడా చెప్పలేదన్నారు.

2009లో యూటర్న్ తీసుకున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టతనివ్వలేదని కోదండరాం ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా బాబు పాదయాత్ర ద్వారా తెలంగాణపై కేంద్రంపై ఒత్తిడిని పెంచకపోవడం బాధను కలిగిస్తోందని అన్నారు. తెలంగాణలో ఆత్మహత్యలను ఆపేందుకు బాబు కనీస మాత్రంగానైనా కృషి చేయడంలేదన్నారు. బాబుకు తెలంగాణపై చిత్తశుద్ధి లేకుండా పోయిందని కోదండరాం ఆరోపించారు. అఖిలపక్షంలో తెలంగాణపై తీర్మానం చేయాల్సిందిగా టీడీపీ, వైఎస్సార్సీపీ ఒత్తిడి తేవాల్సిందన్నారు. ఆ రెండు పార్టీలు తెలంగాణపై కార్యాచరణను ప్రకటించి, చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడిని కొనసాగింపుగా తెలంగాణ ప్రాంత మంత్రుల నియోజకవర్గాల్లో మంగళవారం నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్షికమాలను నిర్వహించనున్నట్లుగా ఆయన తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రసమయి బాల్‌కిషన్ నేతృత్వంలో ధూంధాంలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీల నాయకులు శరద్ పవార్, అజిత్‌సింగ్‌లతోపాటు ఇతర నాయకులను వ్యక్తిగతంగా సమావేశమై కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడిని తీసుకొని వచ్చేలా కార్యాచరణను చేపట్టనున్నట్లు కోదండరాం తెలిపారు. హైదరాబాద్‌లో జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను, ఢిల్లీలో మహాధర్నాను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

తెలంగాణలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో భేటీ అయి, కేంద్రంపై ఒత్తిడిని కొనసాగించాలని కోరనున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ ఉద్యమ కార్యాచరణకు టీజేఏసీ సంపూర్ణ మద్దతునిస్తున్నట్లుగా చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. మజ్లిస్ వాదనకు బలం లేదన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో తెలంగాణ కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఈనెల 11వ తేదీతో 1,111రోజులు పూర్తి కావస్తున్న సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విలేకరుల సమావేశంలో టీజేఏసీ కో చైర్మన్లు మల్లేపల్లి లక్ష్మయ్య, వీ శ్రీనివాస్‌గౌడ్, అధికార ప్రతినిధులు సీ విఠల్, కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్, కారం రవీందర్‌డ్డి, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీవూపసాద్‌రావు, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్, బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ డా టీ రాజేశ్వర్‌రావు, కో చైర్మన్ సీ అశోక్‌కుమార్ యాదవ్, న్యూడెమొక్షికసీ రాష్ట్ర నాయకులు పీ సూర్యం, కే గోవర్ధన్, పీవోడబ్ల్యు అధ్యక్షురాలు వీ సంధ్య, టీజేఏసీ కో-ఆర్డినేటర్ పిట్టల రవీందర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు రాజేందర్‌డ్డి, నల్లపు ప్రహ్లాద్, రసమయి బాల్‌కిషన్, డాట్స్ నర్సయ్య, రేచల్, మమత, విజయలక్ష్మీ, మాదు సత్యం, మామిడి నారాయణ, రాజ్‌కుమార్ గుప్తా, డాక్టర్ శ్రీధర్, ఎంబీ కృష్ణయాదవ్, ఉప్పు సుధాకర్, మునగాల మణిపాల్‌డ్డి, ఆనందం, వెంక ముజీబ్, గోపాల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.