రాస్కోండిరా రాస్కోండి!!

ఒకరేమో 30 కెమెరాలతో వార్తలనందిస్తున్నమని వేసుకుంటున్నరు. ఇంకొకరేమో ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న సమైక్య ఉద్యమంటడు. మరొక మారీచుడేమో సీమాంధ్ర సింహనాదం అంటున్నడు. ఒకడు సమైక్య సమరం అంటడు.. ఇంకొకడు గుండెమండిందంటడు. విభజన సెగ అంటడు.. ఏం మంటలు కనిపించినయ్ మీకు.. చెత్తవార్తలతో జనాన్ని తప్పుదోవపట్టిస్తున్నరు. తెలంగాణవాదులను ఆందోళనకారులంటూ వార్తలు రాసిన కొందరు బేవర్స్ గాళ్లు సమైక్యవాదులను ఉద్యమకారులంటూ రాస్తున్నరు. రాసుకోండిరా.. రాస్కోండి. నేను ఇప్పుడు చెప్పేది కూడా రాస్కోండి..  తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేస్తది.. ఒకవేళ బిల్లుపెట్టకముందే ప్రభుత్వం పడిపోయినా బీజేపీ రెడీగా ఉంది. ఇంకెందుకు ఓ గింజుకుంటరు.. ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్యల వైష్యమ్యాలు నింపుతరు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.