రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైంది: చిదంబరం

 

న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఎలాంటి ఒత్తిడులకు కేంద్రం లొంగేదిలేదని తేలిపోయింది. రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైందని ఇవాళ రాజ్యసభలో కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లనుందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనపై ఇప్పటికే కేబినెట్ నోట్ సిద్ధమైందని, ఆ బిల్లు కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉందని ఆయన అన్నారు. చిదంబరం ప్రకటన చేస్తున్న సమయంలో సీమాంధ్ర ఎంపీలు ఆందోళనకు దిగారు. రాజ్యసభ ఛైర్మన్ స్థానంలో ఉన్న కురియన్ ఎంపీలను వారించారు. తెలంగాణ అంశం చాలా ముఖ్యమైనదని కురియన్ వారికి సూచించి వారించారు. విద్యుత్, నది జలాల పంపిణీ విషయంపై కేంద్ర హోంశాఖ చర్చిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన బిల్లును కేబినెట్ ఆమోదించాక మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పడుతుందని ఆ సంఘం ముందు అందరు తమ వాదనలు వినిపించవచ్చని ఆయన వివరించారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.