రాష్ట్ర విభజన దైవఘటన: స్వరూపానందేంధ్రస్వామి

వరంగల్: రాష్ట్ర విభజన దైవఘటనగా అభివర్ణించారు విశాఖ పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్రస్వామి. రాష్ట్ర విభజనను ఎవరూ అడ్డుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. భద్రాచలం రెవెన్యూ డివిజన్ తెలంగాణలో అంతర్భాగమేనని, తెలంగాణలోనే ఉండాలని అన్నారు. సీమాంధ్ర దేవాలయలతో పోల్చితే తెలంగాణ దేవాలయాలు వివక్షకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాలుగా విడిపోయినా, ఎవరెక్కడ పనులు చేసుకుంటున్నా అందరూ అన్నదమ్ముల్లా కలిసుండాలని ఆయన ఆకాంక్షించారు. అనవసరమైన విధ్వేషాలకు లోనుకావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇరు ప్రాంతాల ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని కోరారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.