రాష్ట్ర విభజనపై మాట మార్చిన బొత్స

హైదరాబాద్: అఖిలపక్ష సమావేశం దగ్గర పడగానే పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజనపై మాట మార్చారు. గతంలో తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటని చెప్పిన ఆయన ఇప్పుడు మాటమార్చి రాష్ట్రాన్ని విభజించాలన్నది తమ అభిమతం కాదని వెల్లడించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని సన్యాయి నొక్కులు నొక్కారు. ఇవాళ ఆయనను కలువడానికి వెళ్లిన తెలంగాణ డీసీసీలతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలని వారు కోరగా బొత్స పై వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ డీసీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన బొత్స ఇప్పుడు ఊసరవెల్లిలా రంగుమార్చి సమైక్యం పాటపాడుతున్నారని డీసీసీలు విమర్శించారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.