రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి

కరీంనగర్, జనవరి 27 : రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్‌రావు డి మాండ్ చేశారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలోఉన్న ప్రభుత్వం పాలకపక్షమా, ప్రతిపక్షమో అర్థం కావడంలేదన్నారు. కేంద్రం ఆదేశాలకు సీఎం కిరణ్ భిన్నంగా వ్యవహరిస్తున్నారని, అసెంబ్లీలో ఆర్టికల్-3పై చర్చించే అధికారంలేదన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నట్లు సీఎం మాట్లాడుతున్నారని, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. స్పీకర్ విశేష అధికారాలను ఉపయోగించి బిల్లును పార్లమెంటుకు పంపించాలని, ప్రభుత్వ బర్తరఫ్‌కు సిఫారసు చేయాలని కోరారు. బిల్లు శాసనసభకు వచ్చిందంటేనే ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లని వెల్లడించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.