రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రతులను చింపడంపై భగ్గుమన్న ఓయూ

డిసెంబర్ 16: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు చించివేయడం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాల్చివేయడంపై ఓయూ విద్యార్థులు భగ్గుమన్నారు. దీనిపై తీవ్రంగా మండిపడుతూ పీడీఎస్‌యూ, ఏబీవీపీ, టీజీవీపీ సంఘాల నేతలు వేర్వేరుగా సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాజ్యాంగ బద్ధంగా రాష్ట్రపతి అసెంబ్లీకి పంపించిన బిల్లును సీమాంధ్ర ఎమ్మెల్యేలు చించడం అప్రజాస్వామికమని, ఇది సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఆధిపత్య ధోరణిని తలపిస్తుందని పీడీఎస్‌యూ నాయకురాలు సత్యవతి అన్నారు. తెలంగాణ ప్రజల పోరాటం, అమరుల త్యాగంతో సాధించుకున్న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును చించి, కాల్చిన సీమాంధ్ర ఎమ్మెల్యేలను వెంటనే అసెంబ్లీ నుంచి డిస్మిస్ చేయాలని బీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు వీరబాబు డిమాండ్ చేశారు.

oujac రాజ్యాంగ నియమాలమేరకు రాష్ట్రపతి పంపించిన తెలంగాణ బిల్లుపై అభివూపాయం చెప్పకుండా బిల్లును చించివేసిన సీమాంధ్ర ఎమ్మెల్యేలను వెంటనే అరెస్టు చేయాలని పీడీఎస్‌యూ (విజృంభణ) ఓయూ నేత సీహెచ్ దయాకర్ కోరారు. బిల్లును చించేసిన సీమాంధ్ర ఎమ్మెల్యేలకు ఆ పదవిలో కొనసాగే హక్కులేదని ఓయూ బీసీ జేఏసీ చైర్మన్ బొమ్మ హన్మంతరావు అన్నారు. మరోపక్క, రాజ్‌భవన్ ముట్టడి కార్యక్షికమంలో పాల్గొన్న టీవీఎస్ నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఓయూ ఎన్‌సీసీ గేట్ వద్ద విద్యార్థులు గవర్నర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అరెస్టు చేసిన విద్యార్థి నాయకులు, విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని టీఎస్ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి, అధ్యక్షుడు మర్రి అనిల్, కన్వీనర్ దూదిమెట్ల బాల్‌రాజ్‌యాదవ్, ఓయూ జాక్ కన్వీనర్ వేల్పుకొండ వెంక నాయకులు వడ్డె ఎల్లన్న, గాదె వెంకట్, కందుల మధు, కృష్ణమాదిగ, ప్రవీణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.