రాష్ట్రపతి పాలన చివరి అస్త్రం: పీసీ చాకో

న్యూఢిల్లీ: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్నది చివరి అస్త్రమని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో స్పష్టం చేశారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైనపుడు, వేరే ప్రత్యామ్నాయ మార్గాలు లేనపుడు రాష్ట్రపతి పాలనే శరణ్యమని అన్నారు. ఏపీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని, దాని బాధ్యతను అది సక్రమంగా నిర్వర్తిస్తుందని తెలిపారు. ఏపీలో శాంతి భద్రతలను కాపాడాలని ఇప్పటికే తాము ప్రభుత్వాన్ని, సీఎంను కోరామని వివరించారు. అది వారి బాధ్యత అని పేర్కొన్నారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.