రాష్ట్రపతి పాలనా?కొత్త ప్రభుత్వమా?

ఫిబ్రవరి 21 :ఉభయ సభల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలనను విధించాలా? లేక కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలా? అనే విషయమై కాంగ్రెస్ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటంతో రాష్ట్ర మంత్రివర్గాన్ని రద్దు చేస్తూ గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గెజిట్ నోటిఫికేషన్ వెలువరించారు. రాష్ట్ర పరిస్థితులను వివరిస్తూ గవర్నర్ కేంద్రానికి నివేదికను సమర్పించారు. రాష్ట్రంలో అనిశ్చితి, అస్థిరత ఏర్పడిందని నివేదికలో ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ప్రాంతాలవారీగా విడిపోయాయని ఏ ఒక్క పార్టీ కూడా మెజారిటీ నిరూపించుకునే పరిస్థితి కనిపించటం లేదని వివరించారు. ముఖ్యమంత్రి పదవికి ఆమోదయోగ్యమైన వ్యక్తి కూడా అగుపించటం లేదని పేర్కొన్నారు. ఈ నివేదికపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయమైంది.

presidentఇంకా ఢిల్లీలోనే ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో తిరిగి ప్రజా ప్రభుత్వ ఏర్పాటు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. శుక్రవారం ఉదయం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ఎంపీ వీ హనుమంతరావు, ఇతర మంత్రులు గీతారెడ్డి, డీ కే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, విప్ ఆరేపల్లి మోహన్, పీసీసీ ప్రొటోకాల్ ఛైర్మన్ హెచ్ వేణుగోపాల్‌రావు తదితరులు దిగ్విజయ్‌సింగ్‌ను ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం కలిసి దాదాపు నలభై నిమిషాలపాటు చర్చలు జరిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం కలుగుతుందో చెప్పాలని ఈ నేతలను డిగ్గీరాజా వాకబు చేశారు. పార్టీకి మేలు జరగాలంటే వెంటనే సీఎల్‌పీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని వారు డిగ్గీరాజాకు చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికల ప్రచారానికి వెళితేనే కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయని సమాచార శాఖ మంత్రి డీ కే అరుణ సూచించినట్టు తెలిసింది. నాయకులు వెలిబుచ్చిన అభిప్రాయాలను అధినేత్రి సోనియాగాంధీకి వివరిస్తానని దిగ్విజయ్ చెప్పారు. గవర్నర్ నివేదిక, రాజ్యాంగపరమైన అంశాలు పరిశీలించి ఆమె ఒక నిర్ణయం తీసుకుంటారని డిగ్గీరాజా అన్నట్టు సమాచారం. రాష్ట్రపతి పాలన విధింపును దాదాపుగా నాయకులంతా వ్యతిరేకించారు.

సీమాంధ్రకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందున ఈ విషయాన్ని ప్రజల్లో ప్రచారం చేసి కాంగ్రెస్‌కు మేలు జరిగేలా చర్యలు తీసుకోవచ్చని, 2014 సాధారణ ఎన్నికల్లో ఈ మేరకు మేలు జరుగుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈ ప్రాంతంలోనూ కాంగ్రెస్‌కే పూర్తి మెజారిటీ సాధ్యమవుతుందని, సోనియాగాంధీని దేవతగా తెలంగాణ ప్రజలు కీర్తిస్తున్నారని వారు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఇటీవల ఢిల్లీ పెద్దలందరినీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్‌ను కూడా కలిసి తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న తాజా పరిస్థితిని శుక్రవారం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలోనూ విసృతంగా చర్చించారు. విభజన నేపథ్యంలో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించినా ఇతర ప్రాంతంవారు అంగీకరించే అవకాశం ఉండదని, అందుకే రాష్ట్రపతి పరిపాలన తప్పదని కోర్ కమిటీ కూడా అభిప్రాయపడినట్టు తెలిసింద

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.