రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే: సునీతాలక్ష్మారెడ్డి

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. టీ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ… టీ బిల్లును స్వాగతిస్తున్నాం. తెలంగాణపై సోనియా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అన్ని పార్టీలతో సంప్రదించాకే తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోంది. చంద్రబాబు తెలంగాణను అనుకూలంగా లేఖ ఇచ్చి కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు. తెలంగాణకు అనుకూలమని పరకాలలో వైసీపీ చెప్పి మాట మార్చింది. కాంగ్రెస్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. తెలంగాణలో వెనకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఇవ్వాలి. కరెంట్ సక్రమ సరఫరా కోసం బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.