రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఈ ఏడాదే ఎన్నికలు

KCRR-సర్వసన్నద్ధంగా ఉండాలి..
-పార్టీ శ్రేణులకు టీఆర్‌ఎస్ అధినేత పిలుపు
-ముందే 71 మంది అభ్యర్థుల ప్రకటన
-సీరియస్‌గా ‘విజయవాడ సడక్ బంద్’
– సహకార ఎన్నికలను పట్టించుకోలేదు
-పల్లె, బస్తీ బాట పనితీరు మెరుగుపడాలి
– పని చేయని ఇన్‌చార్జులపై కఠిన చర్యలు
-కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు
కేంద్రంలో, రాష్ట్రంలో ఈ ఏడాదే ఎన్నికలు రావచ్చునని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు. వీటికి పార్టీ శ్రేణులు సర్వసన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 71 మందిని ముందస్తుగానే ప్రకటిస్తామని వెల్లడించారు. పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహాడ్డి అధ్యక్షతన కమిటీ వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం తెలంగాణభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్‌ఎస్ తరఫున 60శాతం మందికి ముందుగానే బీ ఫాంలను అందజేస్తామని చెప్పినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే నాయకులు, శ్రేణులు పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారని సమాచారం. ‘ఇప్పటికే పార్టీపరంగా బలంగా ఉన్న నియోజకవర్గాల జాబితా నా వద్ద ఉంది. మరి కొన్ని చోట్ల కొద్దిపాటి మార్జిన్‌తో గెలిచేవారి వివరాలూ ఉన్నాయి.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు ఉంటాయి’ అని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. టీజేఏసీ ఇచ్చిన జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్షికమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బెంగళూరు రహదారి దిగ్బంధం తర్వాత విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధానికి సమయం తక్కువగా ఉండటం వల్ల జన సమీకరణ కష్టమవుతుందన్న కేసీఆర్.. ఈ విషయంలో జేఏసీ నాయకులతో చర్చించి విజయవాడ రహదారి దిగ్బంధం తేదీలను మార్చాలని కోరుదామని చెప్పినట్లు తెలిసింది. విజయవాడ రహదారి దిగ్బంధాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. సహకార ఎన్నికల్లో విజయంపై సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు చేసుకుంటున్న ప్రచారాన్ని ఎద్దేవా చేసిన కేసీఆర్.. ‘సహకార ఎన్నికలను మనం ఎప్పుడూ పట్టించుకోలేదు.

మనమే పట్టించుకుని ఉంటే ఫలితాలు ఇలా ఉంటాయా?’ అని విశ్లేషించినట్లు తెలిసింది. ‘మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవరైనా అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలను చూడలేదా? తెలంగాణవాదానికి, సహకార ఎన్నికల ఫలితాలకు ముడిపెట్టడం కాంగ్రెస్ నాయకుల పిచ్చితనం’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొంత మంది ఉత్సాహవంతులు స్థానికంగా పోటీ చేసి గెలుపొందారని కేసీఆర్ అన్నారు. పల్లె, బస్తీ బాట పనితీరు ఇంకా మెరుగుపడాలని కేడర్‌కు కేసీఆర్ సూచించారు. ఈ కార్యక్షికమం నడుస్తున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కమిటీల ఏర్పాటు తీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదని ఆయన చెప్పారు. పార్టీ కార్యక్షికమాలను సీరియస్‌గా తీసుకొని పని చేయకుంటే ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. నియోజకవర్గాల ఇన్‌చార్జులతోపాటు ఎమ్మెల్యేలకూ కఠిన నిర్ణయాలు వర్తిస్తాయని చెప్పినట్లు తెలిసింది. ‘స్నేహితుడైతే అది వ్యక్తిగతంగా ఉంటుంది. కానీ.. పార్టీ ప్రతిష్ఠే ముఖ్యం’ అని ఆయన అభివూపాయపడినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ఈనెల 21లోగా కమిటీలన్నింటినీ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

ఆ తర్వాత ఏప్రిల్‌లో బస్సుయాత్ర నిర్వహిస్తానని, అప్పుడు నియోజకవర్గ ఇన్‌చార్జులలో మార్పులు, చేర్పులు తప్పకపోవచ్చని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయా జిల్లాల కేడర్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశాలను నిర్వహించి దిశానిర్దేశం చేశారని సమాచారం.

టీఆర్‌టీయూ ఆఫీసు ప్రారంభించిన కేసీఆర్
తెలంగాణ భవన్‌లో టీఆర్‌టీయూ కార్యాలయాన్ని కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. టీఆర్‌టీయూ అధ్యక్షుడు మునగాల మణిపాల్‌డ్డిని ఈ సందర్భంగా కేసీఆర్ అభినందించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముందు టీఆర్‌టీయూ 2013 డైరీని, టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ నేతృత్వంలో ముద్రించిన డైరీని, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పొల్సాని వింధ్యారాణి, డాక్టర్ సులోచన, నీలం దేవి నేతృత్వంలో ముద్రించిన 2013 క్యాలెండర్‌ను, కోమటిడ్డి బుచ్చిడ్డి రచించిన ‘డమరుకం’ కవితా సంపుటిని కేసీఆర్ ఆవిష్కరించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.