రాయల, ప్యాకేజీలకు ఒప్పుకోం..విభజనే కావాలి

mahabubna-ప్రాంతీయ పార్టీలు లేకుంటే జాతీయ పార్టీలే లేవు
-మా ఏకైక ఎజెండా రాష్ట్ర ఏర్పాటే: కేకే
-మళ్లీ మోసానికి కాంగ్రెస్ యత్నం: మందా
-కుట్రలు చేస్తే ఉద్యమం తీవ్రతరం: హరీశ్‌రావు
-పది జిల్లాల తెలంగాణకావాలి: కేటీఆర్
-కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి: స్వామిగౌడ్
గద్వాల, జూన్ 27 (టీ మీడియా):‘తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేశాం. జైలుకు వె ళ్లాం. ఎంతో మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణపై నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ఇక ఏర్పాటు ప్రజల చేతుల్లోనే ఉంది’ అని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు పేర్కొన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో నిర్వహించిన టీఆర్‌ఎస్ శిక్ష ణ శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రతిపార్టీ ఒక ఎజెండాతో ముందుకు పోతోందని, టీఆర్‌ఎస్ కు మాత్రం రాష్ట్రాన్ని సాధించడమే తప్ప మరొకటి లేదన్నారు. ప్రజలు ఓటు ద్వారా తెలంగాణను సాధించుకోవడం సులభమన్నారు. గతంలో ఓ పార్టీ తెలంగాణ ఇచ్చేది మేమే.. తెచ్చేది మేమే అని ప్రగల్భాలు పలికి వెయ్యిమంది ఆత్మబలిదానాలకు కారణమైందన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ నాశనం కాక తప్పదని హెచ్చరించారు. ఇది తెలంగాణ కోసం చివరి ఉద్యమమని, చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని బీజేపీ అంటోందని, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

తెలంగాణ కోసం అన్ని వర్గాల వారిని కలుపుకొని పోతామన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల తెలంగాణ ఎలా వస్తుందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయని, ప్రాంతీయ పార్టీలు లేనిదే, జాతీయ పార్టీలు మనుగడ సాగించలేవన్నారు. ఎంపీ మందా జగన్నాథం మాట్లాడుతూ కాంగ్రెస్ మళ్లీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందడానికి తెలంగాణవాదాన్ని తెరపైకి తీసుకొచ్చిందన్నారు. ఎన్నికల్లో గెలిచాక వాదంలేదని చెప్పడానికి కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన్నారు. నాగం జనార్దన్‌డ్డికి జాతీయ రాజకీయాలపై అవగాహన లేదని విమర్శించారు. కార్యక్షికమంలో ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ జితేందర్‌డ్డి, విఠల్‌రావుఆర్య తదితరులు పాల్గొన్నారు.

 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.