రాయల తెలంగాణ కుట్రపూరితం: పొన్నం

రాయల తెలంగాణ ప్రతిపాదన కుట్ర పూరితమైనదిగా కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అభివర్ణించారు. సీమాంధ్రలో రాజధాని విషయంలో ఇబ్బందులు కలుగుతాయనే రాయల తెలంగాణ ఏర్పాటు ప్రచారం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. సమైక్యం పేరుతో సీమాంధ్ర ప్రజలను అక్కడి నాయకులు మోసగిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో అందరికి రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం చెబుతూనే ఉంది, అయినా ఏపీఎన్జీవోల నేత అశోక్‌బాబు అందరిని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.